విజయనగరం : పోలీసు శాఖలో ఆయనో సాధారణ ఉద్యోగి. కనీసం కానిస్టేబుల్ కూడా కాదు. అంతకన్నా దిగువ ర్యాంకు ఉన్న హోంగార్డు మాత్రమే. కానీ ఏసీబీలో(ACB Raids) ఉద్యోగం ఆయన అవినీతి ఆలోచనలకు బీజం వేసింది. అవినీతి అధికారుల ఆచూకీ తెలుసుకొని వారి నిగ్గు తేల్చే అవినీతి నిరోధ శాఖలో ఆయనకు హోంగార్డుగా అవకాశం రావడంతో ఆయన పంట పండింది. ఒక నెల కాదు., ఒక సంవత్సరం కాదు… ఏకంగా 15 సంవత్సరాల పాటు ఏసీబీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వర్తించారు.
Read Also:Madhya Pradesh: గురువే మృగంగా మారాడు.. బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి

అవినీతి అధికారులపై(ACB Raids) వస్తున్న ఫిర్యాదుల సమాచారాన్ని చాకచక్యంగా మరో కంటికి తెలియకుండా తెలుసుకొని నేరుగా సదరు అవినీతి అధికారులతోనే మాట్లాడి బేరం పెట్టుకునేవాడు. ముందస్తు సమాచారం ఇవ్వడం ద్వారా వారిని అప్రమత్తం చేయడం, వారి నుంచి భారీ మొత్తంలో రూపాయలను గుంజడం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను పోగేసుకున్నాడు. సదరు హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు కదలికలను, వ్యవహార శైలిని అనుమానించిన అధికారులు ఆరు నెలల క్రితం ఆయనను ఏసీబీ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపించేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: