ప్రముఖ ఇస్లామీయ పండితుడు, ఫిఖా నిపుణుడు, సమాజానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు హజ్రత్ మౌలానా(Abdul Wahab) ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ ఖాసిమీ రషాది (రహిమహుల్లాహ్) పరమపదించటం తనను తీవ్రంగా కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తెలిపారు.
Read Also: AP: నేడు ఏపీ కేబినేట్ సమావేశం

ఇస్లామీయ విద్యకు ఆరు దశాబ్దాల సేవ
మౌలానా అబ్దుల్ వహాబ్ సాహెబ్(Abdul Wahab) తన జీవితంలో 60 ఏళ్లకుపైగా కాలాన్ని ఇస్లామీయ విద్యా ప్రచారం, ఖుర్ఆన్–హదీస్ బోధన, అలాగే జామియా నూరుల్ హుదా మద్రసా అభివృద్ధికి అంకితం చేశారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఆయన మరణం ఇస్లామీయ సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి ధార్మిక బాధ్యతలు
ఆయన గత 50 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తబ్లిగ్-ఏ-జమాత్ అధ్యక్షులుగా సేవలందించారని, అలాగే 2008 నుంచి ఏపీ రాష్ట్ర జమీయత్-ఉలమా గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారని చంద్రబాబు గుర్తు చేశారు. అరబీ సాహిత్యం, ఫిఖ్, హదీస్‌తో పాటు ఇతర ఇస్లామీయ శాస్త్రాలలో లోతైన పరిజ్ఞానం కలిగిన జయ్యద్ ఆలిమ్‌గా గుర్తింపు పొందారని తెలిపారు. ధార్మిక బోధనతో పాటు సామాజిక సేవలలో కూడా ఆయన విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
మౌలానా అబ్దుల్ వహాబ్ సాహెబ్ మృతిపై మంత్రి నారా లోకేశ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. తన జీవితాన్ని పూర్తిగా అల్లాహ్ దీన్ సేవకు అంకితం చేసిన ఈ ధార్మిక ప్రబోధకునికి స్వర్గప్రాప్తి కలగాలని ప్రార్థిస్తున్నానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: