విజయవాడ : రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం, క్వాంటమ్ కంప్యూటస్ ఏర్పాటు, విశాఖలో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడులదారుల సదస్సు తదితరాల అనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కు వివరించారు, పెట్టుబడుల దిశగా రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, విద్యారంగం, వైద్యం తదితంంశాల్లో మౌలిక విషయాలు, సదుపాయాల గురించి ఆయన గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీరు వివరించారు.
Read also: Cycling Track: త్వరలో వైజాగ్ లో సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటు – సీఎం చంద్రబాబు

Abdul Nazeer meets CM Chandrababu Naidu
ప్రాంతీయాభివృద్ధిని గురించి
జిల్లాల పునర్విభజనంశంపై, రాష్ట్రమంతటా సమాంతర ప్రాంతీయాభివృద్ధిని గురించి వివరించారు. గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ తో జాతీయ, రాష్ట్రీయంశాల పైన ముచ్చటించారు. ఇందుకు సంబంధించి అందుబాటులోకి వచ్చిన కీలక సమాచారాన్ని అనుసరించి సిఎం చంద్రబాబు నిన్న లోక భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు. సిఎం చంద్రబాబు మర్యాద పూర్వకంగా గవర్నర్ తో సమావేశమయ్యారని సిఎంఒ వర్గాల సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: