ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత వృద్ధి, ప్రగతి సాధించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chnadrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం ప్రాంతాల్లో నాలుగు కొత్త ఎయిర్‌పోర్టులను (New Airports) నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నూతన విమానాశ్రయాల నిర్మాణంతో భౌగోళికంగా రాష్ట్రం మరింత అనుసంధానమవుతుందని, వాణిజ్య, పర్యాటక రంగాలకు ఊతమిస్తుందని ఆయన తెలిపారు.
రాష్ట్రానికి సముద్రపు హార్బర్లు, విమానాశ్రయాలు అత్యంత కీలకం
2026 నాటికి ఈ నాలుగు విమానాశ్రయాలు అలాగే నాలుగు హార్బర్లు సిద్ధం కావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి సముద్రపు హార్బర్లు, విమానాశ్రయాలు అత్యంత కీలకమైన ఆర్థిక వనరులుగా తయారవుతాయని పేర్కొన్నారు. వీటిని రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దేందుకు నాణ్యమైన పద్ధతుల్లో నిర్మించాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
అధిక రద్దీ ఉండే రోడ్లను ప్రాధాన్యతా
అంతేకాక, అధిక రద్దీ ఉండే రోడ్లను ప్రాధాన్యతా క్రమంలో విస్తరించడానికి PPP (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానాన్ని అనుసరించనున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్ర రహదారులను నేషనల్ హైవేలతో అనుసంధానించి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. ఈ నిర్మాణ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మార్గం వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : Gandhi Bhavan : గాంధీ భవన్ కు భద్రత పెంపు.. కారణమా అదేనా ?