తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త లాంటి సమాచారం ఇది. కొందరికి వరుసగా మూడు రోజుల సెలవులు రానున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, ఐటీ, కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ వారాంతం లాంగ్ వీకెండ్‌గా మారనుంది. శని, ఆదివారాల సాధారణ సెలవులతో పాటు సోమవారం రిపబ్లిక్ డే రావడంతో మూడు రోజుల నిరంతర విరామం లభించనుంది. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూళ్లు సైతం వారానికి 5 రోజులే నడుస్తుండటం, 26న పబ్లిక్ హాలిడే కావడంతో స్టూడెంట్స్ రేపటి నుంచి, 3 రోజులు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు.
Read Also: Revanth vs Uttam : ఉత్తమ్ పై సీఎం రేవంత్ నిఘా అనే వార్తలపై మంత్రి క్లారిటీ

రిపబ్లిక్ డే రోజున మాత్రమే సెలవులు
అయితే..అన్ని పాఠశాలలకు శనివారం సెలవు ఉండకపోవచ్చు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ స్కూల్స్‌లో శనివారం సాధారణ పని దినంగా కొనసాగనుంది. అలాంటి పాఠశాలల్లో శనివారం క్లాసులు నిర్వహించి..ఆదివారం.. రిపబ్లిక్ డే రోజున మాత్రమే సెలవులు ఇవ్వనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు మాత్రం, శనివారం సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడం ఖాయమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: