తిరుపతి (Tirupati) లో మరో అరుదైన వైద్య విజయగాథ నమోదైంది. శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం (SPCH)లో వైద్యులు ఒక క్లిష్టమైన గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ వైద్యరంగంలో మరో మైలురాయిగా నిలిచింది.
Perni Nani : పేర్ని నాని Vs మచిలీపట్నం CI ..పోలీస్ స్టేషన్లో రచ్చ.. రచ్చ
రాజమహేంద్రవరానికి చెందిన 28 ఏళ్ల విజయకృష్ణ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అవ్వడంతో, అతని గుండెను జీవన్‌ధాన్ ద్వారా సత్యవేడు (Satyavedu) కు చెందిన 14 ఏళ్ల బాలుడికి అమర్చారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుంటూరు నుంచి విజయవాడ ఎయిర్‌పోర్ట్ (Vijayawada Airport) నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి గుండెను తరలించి, అనంతరం ఎస్పీసీహెచ్‌లో విజయవంతంగా అమర్చారు.
ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో, డాక్టర్ సందీప్, డాక్టర్ హర్ష, డాక్టర్ మధు బృందం ఈ క్లిష్టమైన గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఈ ఆపరేషన్‌తో ఎస్పీసీహెచ్‌లో జరిగిన గుండె మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్య 21కి చేరింది.
చికిత్స పొందుతూ
రాజమహేంద్రవరానికి చెందిన విజయకృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు కిమ్స్‌లో చికిత్స పొందుతూ వైద్యులు బ్రెయిన్‌డెడ్ (Braindead) గా నిర్ధారించారు. అయితే ఈ విషయాన్ని జీవన్‌ధాన్ సంస్థ కుటుంబ సభ్యులకు తెలియజేసి, అవయవదానం ప్రాముఖ్యతను వివరించారు. అతని కుటుంబ సభ్యుల అంగీకారంతో,
ద్వారా విజయకృష్ణ గుండెను దానం చేసేందుకు ముందుకు వచ్చింది. తిరుపతి (Tirupati) జిల్లా సత్యవేడు ప్రాంతానికి చెందిన ఒక 14 ఏళ్ల బాలుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. తిరుపతిలోని శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

జీవన్‌దాన్ పోర్టల్‌లో నమోదు చేయబడింది
అతని పేరు గుండె మార్పిడి కోసం జీవన్‌దాన్ పోర్టల్ (Jeevan Daan Portal) లో నమోదు చేయబడింది.అప్పుడు 14 ఏళ్ల బాలుడికి అమర్చాలని నిర్ణయించారు. ఈ గుండె మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడానికి, టీటీడీ ఈవో ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.
వెంటనే గుంటూరు నుంచి గుండెను గ్రీన్‌ఛానల్ ద్వారా విజయవాడకు తరలించారు. అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేర్చారు. విమానాశ్రయం నుంచి కూడా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి, గుండెను అత్యంత వేగంగా ఎస్పీసీహెచ్‌కు తరలించారు.
దాదాపు 6 గంటల పాటు శ్రమించిన వైద్యులు, బాలుడికి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ అవయవదానం ఆ బాలుడికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. విజయకృష్ణ కుటుంబ సభ్యులు కూడా పెద్ద మనసుతో ఆలోచించడంతో బాలుడి ప్రాణాలు నిలబడ్డాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: