हिन्दी | Epaper

మోహన్ బాబు, మంచు మనోజ్ కు పోలీసుల షాక్

Vanipushpa
మోహన్ బాబు, మంచు మనోజ్ కు పోలీసుల షాక్

టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. తిరుపతి జిల్లా రంగంపేటలో ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీ విషయంలో ఆయనకూ, కుమారుడు మంచు మనోజ్ కు సాగుతున్న పోరు తాజాగా మరో మలుపు తిరిగింది. మోహన్ బాబు యూనివర్శిటీలోకి వెళ్లేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్న మంచు మనోజ్.. భార్య మౌనికా రెడ్డితో కలిసి వచ్చారు. పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా యూనివర్శిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో యూనివర్సిటీ సిబ్బందికీ, మనోజ్ బౌన్సర్లకూ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చివరకు పోలీసులకు తన తాత సమాధి వరకూ వెళ్లి వస్తానని చెప్పి అనుమతి తీసుకుని మనోజ్ లోపలికి వెళ్లారు.

 manchu manoj
manchu manoj

మోహన్ బాబు యూనివర్శిటీలోకి వెళ్లకుండా మంచు మనోజ్ పై కోర్టు ఆంక్షలు విధించినా తన తాత సమాధికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించడం తాజా వివాదానికి కారణమైంది. దీంతో వివాదం ముగిసిందని భావిస్తున్న తరుణంలో పోలీసులు, మోహన్ బాబు వర్శిటీ సిబ్బందిపై మనోజ్ ఫైర్ అయ్యారు.

దీనికి కొనసాగింపుగా మోహన్ బాబు యూనివర్శిటీ సిబ్బందిపై చంద్రగిరి పోలీసు స్టేషన్ కు వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ దంపతులపై మోహన్ బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్‌ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్‌, మౌనికతో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. మనోజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్‌బాబు పీఏతో పాటు ఎంబీయూ సిబ్బంది 8 మందిపై కేసులు పెట్టారు. దీంతో ఈ వ్యవహారంలో పోలీసుల తదుపరి యాక్షన్ పై ఉత్కంఠ నెలకొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

📢 For Advertisement Booking: 98481 12870