వినియోగదారులకు తపాలా శాఖ నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ పోస్ట్ బుకింగ్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని తపాలా శాఖ అందుబాటులోకి తీసుకురాబోతుంది. జూలై 22 నుంచి ఈ కొత్త సౌకర్యం ప్రారంభం కానుంది. ఇది తపాలా సేవల్లో ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఇప్పటివరకు రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ పంపించాలంటే వినియోగదారులు తపాలా కార్యాలయానికి వెళ్లాల్సివచ్చేది. కానీ ఇప్పుడు, ఈ సేవలను డోర్ స్టెప్ వద్దనే పొందే అవకాశం లభిస్తోంది.ఈ సరికొత్త సేవ కోసం తపాలా శాఖ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ సేవ Advanced Postal Technology 2.0 లో భాగంగా ప్రారంభించబడుతుంది. దీని కోసం ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఆ యాప్‌ను వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకుని, తమ ఇంటి వద్ద రిజిస్టర్ పోస్ట్ సేవ అవసరమని అభ్యర్థన పంపించవచ్చు. అభ్యర్థనను స్వీకరించిన వెంటనే తపాలా శాఖ సిబ్బంది ఇంటికి వచ్చి, రిజిస్టర్ పోస్టును స్వీకరిస్తారు.
రెండూ మ్యాచ్
మరోవైపు 5 వందల రూపాయలు లోపు విలువైన ఆర్టికల్స్‌ను రిజిస్టర్, స్పీడ్ పోస్టులో పంపాలనుకునే వినియోగదారులు తొలుత వాట్సప్ ద్వారా పోస్టల్ సిబ్బందికి సమాచారమివ్వాలి. ఆ తర్వాత వినియోగదారుడి ఫోన్‌కు ఓ ప్రత్యేకమైన బార్‌కోడ్ నంబరు, అలాగే ఓటీపీ పంపుతారు. అనంతరం రిజిస్టర్ పోస్టు కోసం ఇంటికి వచ్చే తపాలా శాఖ సిబ్బంది వద్ద ఈ బార్‌కోడ్, ఓటీపీ వివరాలు సరిచూసుకోవాలి. రెండూ మ్యాచ్ అయితే తపాలా సిబ్బందికి ఆర్టికల్స్ అందజేయాలి.అయితే రూ.500 లోపు విలువైన వస్తువులు/ ఆర్టికల్స్ రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు చేయాలంటే ఎలాంటి సర్వీస్ ఛార్జ్ (Service charge) అవసరం లేదు. ఒకవేళ రిజిస్టర్ పోస్టు చేసే ఆర్టికల్స్ విలువ రూ.500కు పైగా ఉంటే వాటికి మాత్రం నిర్దేశించిన మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తపాలా శాఖ సిబ్బంది తెలిపారు.

ప్రస్తుతం రిజిస్టర్
మరోవైపు అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0లో భాగంగా పోస్టల్ డిపార్టుమెంట్ క్లౌడ్ టెక్నాలజీకి ప్రస్తుత డేటాను అనుసంధానిస్తోంది. ఈ నేపథ్యంలో జూలై 21న పోస్టల్ సేవలు అందుబాటులో ఉండవు.మరోవైపు ప్రస్తుతం రిజిస్టర్ పోస్టు చేయాలంటా పోస్టాఫీసు (post office) కు వెళ్లి, రిజిస్టర్ పోస్టు బుకింగ్ ఫారమ్‌ను పూరించాలి. ఇందులో పంపినవారితోపాటుగా స్వీకర్త పేరు, చిరునామా, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత రిజిస్టర్ పోస్టు చేస్తున్న పార్శిల్ బరువు, గమ్యస్థానం ఆధారంగా ఛార్జీలు నిర్ణయిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని తపాలా శాఖలు ఉన్నాయి?
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 8,000కి పైగా తపాలా శాఖలు ఉన్నాయి. ఇందులో హెడ్ పోస్టాఫీసులు, సబ్ పోస్టాఫీసులు, బ్రాంచ్ పోస్టాఫీసులు ఉంటాయి. ఇవి అన్ని గ్రామాల నుండి పట్టణాల వరకు సేవలు అందిస్తాయి.
ఆంధ్రప్రదేశ్ పోస్టాఫీస్ సమయాలు ఏంటి?
అధికంగా పోస్టాఫీసులు ఉదయం 9:00 AM నుండి సాయంత్రం 5:00 PM వరకు పనిచేస్తాయి. ఆదివారాలు, ప్రభుత్వ సెలవుదినాల్లో మూసివుంటాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Mithun Reddy: మిథున్ రెడ్డి అరెస్ట్‌పై పెద్దిరెడ్డి ఏమన్నారంటే?