Anchor shyamala: బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసిన కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టు లో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యాయస్థానం ఆమెను అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణకు సహకరించాల్సిందిగా యాంకర్ శ్యామలకు సూచించారు. ఈ క్రమంలో యాంకర్ శ్యామల ఈరోజు(సోమవారం) పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరు
ఈ తరుణంలో యాంకర్ శ్యామలతో పాటు నేడు విచారణకు బయ్యా సన్నీ యాదవ్, అజయ్, సుధీర్ లు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్‌లు ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. వీరి ఇరువురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ రీతూచౌదరి, టీవీ యాంకర్ విష్ణుప్రియలు సైతం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు
ఇక యాంకర్ శ్యామల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దీంతో ఆమెను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఉన్న కారణంగా నటి శ్యామల పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వైసీపీ ప్రతినిధి అంటూ మండిపడుతున్నారు. తెలుగు తమ్ముళ్లు పంజాగుట్ట పిఎస్ కు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్యామల అంటూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు.