anchor syamala

Anchor Shyamala: చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణలపై యాంకర్ శ్యామల విమర్శలు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి మరియు బుల్లితెర యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా కూటమి పాలనలో బాలికలు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె మండిపడ్డారు తాడేపల్లిలో మీడియా వేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ ఆరోపణలను వెలువరించారు ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై దాడులు అఘాయిత్యాలు జరుగుతున్నాయని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురంలో ఒక మహిళపై జరిగిన అత్యాచార ఘటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు దూపురంలో అత్తా-కోడళ్లపై గ్యాంగ్ రేప్ ఘటన జరిగితే బాలకృష్ణ ఎందుకు స్పందించలేదని అతను ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీశారు.

శ్యామల ఒక మహిళగా ఒక తల్లిగా హోం మంత్రి అనిత కూడా ఈ విషయంలో సరైన విధంగా స్పందించడం లేదని విమర్శించారు ఎన్నో దారుణాలు జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ఘటనలు గురించి బాధ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తమ ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం దిశ యాప్ తీసుకువచ్చి దాని ద్వారా ఎంతో మంది మహిళలకు న్యాయం జరిగిందని శ్యామల గుర్తు చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ యాప్ ను పక్కన పెట్టారని జగన్ కు మంచి పేరు వస్తుందని భయపడి దానిపై బురద చల్లారని ఆరోపించారు అంతేకాకుండా రాష్ట్రంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ మళ్లీ బయల్పడుతోందని గతంలో ఈ రాకెట్‌కు సంబంధించి తీసుకున్న చర్యలను వదిలిపెట్టి మళ్లీ అదే పరిస్థితులు నెలకొంటున్నాయని శ్యామల అన్నారు మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

Related Posts
గ్లామర్ షో లో తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మలు
kiara advani

పెళ్లైతే గ్లామర్ షో ఆపాలా? అలాంటిదేమైనా రాజ్యాంగంలో రాసుందా?"అంటూ ప్రశ్నిస్తున్నారు మన సినీ తారలు. ఒకప్పుడు పెళ్లి అంటే నటీమణుల కెరీర్‌కు శుభం కార్డ్ అనుకునేవాళ్లు.కానీ కాలంతో Read more

అందానికి అందం ప్రేక్షకుల ముందుకు రానుంది రాశి ఖన్నా
rashi khanna

టాలీవుడ్‌లో హీరోయిన్ రాశి ఖన్నా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె, జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీం, Read more

హనీరోజ్ కోరికలు మాములుగా లేవుగా..
Actress Honey Rose

హనీ రోజ్ అంటే పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ,సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్ని తన అందం,అందచందాలతో మెస్మరైజ్ చేస్తోంది.ముఖ్యంగా Read more

Court Movie : నాలుగోవరోజు టోటల్ కలెక్షన్స్ ? Cr
Court Movie : నాలుగోవరోజు టోటల్ కలెక్షన్స్ ? Cr

కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ - తెలుగు సినిమా సమీక్ష నాలుగోవరోజు టోటల్ కలెక్షన్స్ 14.84 Cr 'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ' 2025 Read more