image

ఏపీ పర్యటనకు వెళ్లనున్న అమిత్‌షా

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం (18వ తేదీ) ఏపీ పర్యటనకు వెళ్లనున్నారు. కృష్ణా జిల్లా , గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ , ఎన్ఐడీఎం ప్రాంగణాలను కేంద్ర హోం మంత్రి ప్రారంభించనున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి వస్తారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు. 19న ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తదితరులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

Advertisements

విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో పాటు పదో బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభిస్తారు. ఇవి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోనివి కావడంతో ఆయన ప్రత్యేకంగా వస్తున్నారు. ఈ పర్యటన రాజకీయంగా కూడా ఆసక్తి రేపుతోంది. అమిత్ షా పర్యటన కోసం ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా రాజకీయాలను అమిత్ షానే పట్టించుకుంటంటారు. పాలన పరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజీగా ఉంటారు. అయితే అంతిమ నిర్ణయం తీసుకునేది ప్రధాని మోడీనే. పనులన్నీ చక్కబెట్టేది అమిత్ షా. ఏపీ పర్యటనలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ ముగ్గురి మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

image
image

కాగా, ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి ఏడు నెలలు గడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్‌సీపీ నిర్వాకాల కారణంగా ఎన్నో బ్యాక్ లాగ్స్ పెండింగ్‌లో ఉన్నాయని .. వాటిని క్లియర్ చేయాల్సి ఉందని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన అనేక అవకతవకలపై నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. అందులో కొన్నింటిలో కేంద్ర దర్యాప్తు సంస్థల ఇన్వాల్వ్ మెంట్ అవసరమని భావిస్తున్నారు. ఈ క్రమంలో అన్నింటిపై ముగ్గురు నేతల మధ్య చర్చలు జరిగే అవకాశముందని తెలియవచ్చింది.

  • Read more :

Related Posts
ప్రపంచ రికార్డు సాధించిన 7వ తరగతి విద్యార్థి..
yoga

తమిళనాడులోని 7వ తరగతి విద్యార్థిని జెరిదిషా, ఇనుప మేకుల పై 50 యోగా ఆసనాలను 20 నిమిషాల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ అద్భుతమైన Read more

నాసా ఉపగ్రహ చిత్రాలు: ఇండో-గంగా ప్రాంతంలో తీవ్రమైన కాలుష్య పరిస్థితి
indiafog tmo 20240115 lrg

నాసా ఉపగ్రహ చిత్రాలు ఒక ఆందోళనకరమైన దృశ్యాన్ని చూపిస్తున్నాయి. భారతదేశం మరియు పాకిస్థాన్ మధ్య ఉన్న ఇండో-గంగా ప్రాంతం ఇప్పుడు తీవ్రమైన కాలుష్యంతో కప్పబడి ఉంది. ఈ Read more

ఉద్యోగ నియామకాల్లో కాంగ్రెస్ తీరు పై హరీష్ రావు ఆగ్రహం
harish rao cm revanth

ఉద్యోగ నియామకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ ప్రభుత్వం నోటిఫికేషన్లు Read more

ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి
ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి

ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం గుండాల కోన వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గుండాలకోన ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు Read more