Amit Shah comments are proof of BJP arrogance.. sharmila

అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం

అమరావతి: పీసీసీ చీఫ్ షర్మిల కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై విమర్శలు గుప్పించారు. అమిత్ షా తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్‌ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం అంటూ ట్వీట్‌ చేశారు. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం అని ఫైర్‌ అయ్యారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లేనన్నారు.

అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాడ్‌ చేశారు. మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా AICC పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కోరుతున్నానని షర్మిల తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే ఇదంతా. మనుస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోంది. రాజ్యాంగ నిర్మాతను ప్రతి సారి హేళన చేస్తోంది. మన రాజ్యాంగం మీద, మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితం అయ్యిందని షర్మిల ఆగ్రహించారు.

మరోవైపు రాజ్యాంగ నిర్మాతను అమిత్ అగౌరవపరిచారని ఆరోపించిన ఖర్గే, మంగళవారం రాజ్యసభలో తన ప్రసంగంలో అంబేద్కర్‌ను అవమానించినందుకు హోంమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. “బాబాసాహెబ్‌కు గౌరవం ఉంటే, అమిత్ షాను వెంటనే తన మంత్రివర్గం నుండి తొలగించాలని నేను ప్రధానమంత్రికి చెప్పాలనుకుంటున్నాను” అని ఖర్గే ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండించదగినవి, వారు పూజనీయులుగా భావించే దళిత హీరోని ఆయన అవమానించారు. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని ఖర్గే అన్నారు. షా చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పడానికి బదులు మోడీ తన హోంమంత్రిని సమర్థిస్తున్నారని ఆయన ప్రధానిపై మండిపడ్డారు.

Related Posts
Narendra Modi: వచ్చే నెలలో అమరావతికి రానున్న మోదీ
అమరావతిలో మోదీ పర్యటన – లక్ష కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!

అమరావతి మరోసారి చరిత్ర సృష్టించనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఏప్రిల్ 15 నుండి 20వ తేదీ మధ్య ఆయన Read more

కడప జిల్లాలో “మహానాడు” : అచ్చెన్నాయుడు
"Mahanadu" in Kadapa District : Atchannaidu

అమరావతి: టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే "మహానాడు" కార్యక్రమాన్ని ఈసారి కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం పార్టీ పొలిట్ బ్యూరో Read more

12న అరకులో సుప్రీం జడ్జిల బృందం పర్యటన
A team of Supreme Judges vi

ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతమైన అరకులో ఈ నెల 12న సుప్రీంకోర్టు జడ్జిల బృందం పర్యటించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI)తో పాటు 25 మంది సుప్రీం జడ్జిలు, Read more

17 వేల మంది ఉద్యోగులపై వేటు: బోయింగ్ విమాన సంస్థ
17 thousand employees fired. Boeing aircraft company

ముంబయి: విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది అంటే 17 వేల మంది Read more