భారత జట్టు గెలుపు పై ష‌మా ట్వీట్‌

భారత జట్టు గెలుపు పై ష‌మా ట్వీట్‌

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ ప్రతినిధి షమా మహమ్మద్ చేసిన ట్వీట్ తీవ్ర వివాదానికి దారి తీసింది. రోహిత్ శర్మ బరువు తగ్గాలని, అతను ఫిట్‌గా లేడని పేర్కొంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాడీ షేమింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఇది కేవలం క్రికెట్ ప్రేమికుల మధ్యనే కాకుండా, రాజకీయ, క్రీడా వర్గాల్లోనూ భిన్న స్పందనలకు దారి తీసింది.

Advertisements

ట్వీట్‌

ట్వీట్‌పై రాజకీయ నాయకులు, మాజీ క్రికెటర్లు, నెటిజనులు భిన్నంగా స్పందించారు. షమా తన ట్వీట్‌లో ‘రోహిత్‌ శర్మ క్రీడాకారుడిగా ఫిట్‌గా లేడు అతడు బరువు తగ్గాలి. భారత క్రికెట్‌ జట్టులో గత సారథులతో పోల్చితే ఆకట్టుకోని కెప్టెన్‌ అతడే’ అని రాసుకొచ్చింది.

ట్వీట్ తొలగింపు

షమా వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్‌ బండారి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటు భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌నూ వాళ్లు వదట్లేదు. రాజకీయాల్లో విఫలమైన వారి నాయకుడు రాహుల్‌ గాంధీని వాళ్లు క్రికెట్‌ ఆడాలని కోరుకుంటున్నారేమో’ అని కౌంటర్‌ ఇచ్చాడు. షమా ట్వీట్‌ రాజకీయంగా దుమారం రేపడంతో కాంగ్రెస్‌ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎప్పటిలాగానే అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, వాటికి పార్టీతో సంబంధం లేదని తెలిపింది. ఆ తర్వాత షమా తన ట్వీట్‌ను తొలగించింది.

మంగ‌ళ‌వారం జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియా పై టీమ్‌ ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో రోహిత్ సేన‌ మట్టికరిపించింది. కంగారూలు నిర్దేశించిన 265 పరుగుల ఛేదనను రోహిత్‌ సేన 48.1 ఓవర్లలో పూర్తిచేసి ఈ టోర్నీలో వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరింది. భార‌త జ‌ట్టు సాధించిన ఈ అద్భుత విజ‌యం ప‌ట్ల స‌ర్వత్రా ప్రశంస‌లు వెళ్లువెత్తుతున్నాయి. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు భారత జట్టుకు అభినందనలు తెలుపుతున్నారు.

ష‌మా మ‌హమ్మద్ తాజా ట్వీట్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించిన టీమ్‌ ఇండియాకు అభినందనలు. కీల‌క మ్యాచ్‌లో 84 పరుగులు సాధించడంతో పాటు ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్లలో వెయ్యి ర‌న్స్‌ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచిన విరాట్ కోహ్లీకి ప్రత్యేక అభినంద‌న‌లు అని ష‌మా ట్వీట్ చేశారు.అంతేకాకుండా ‘రోహిత్‌ శర్మ నాయకత్వంలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. 84 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లీకి ప్రత్యేక అభినందనలు. ఫైనల్‌ కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అంటూ షమా మీడియాతో అన్నారు.

Related Posts
మెరిసిన యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి!
మెరిసిన యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి!

బాక్సింగ్ డే టెస్టు 3వ రోజు యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తన తొలి అంతర్జాతీయ సెంచరీతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో భారత్ Read more

అయోధ్య వివాదం పరిష్కారం కోసం దేవుడిని ప్రార్థించాను: సీజేఐ డీవై చంద్రచూడ్‌
Prayed to God for a solution to Ayodhya dispute says CJI Chandrachud

న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోరుతూ దేవుడిని ప్రార్థించానని ఆయన చెప్పారు. Read more

బిజెపి నేతతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సెల్ఫీ
MP Shashi Tharoor selfie

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఈ Read more

ఏపీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం-కేంద్రం అఫిడవిట్‌పై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఊహించని తీర్పు ఒకటి సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. బస్సు ఢీ కొట్టడం వల్ల ఓ మహిళ మృతి చెందడంతో.. ఆమె కుటుంబ సభ్యులకు Read more

×