Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు అయింది. ఏప్రిల్ 6వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ఒక ప్రోటోకాల్ షెడ్యూల్ విడుదల చేశారు. కానీ అనివార్య కారణాలతో పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ మేరకు అధికారులు మరో శనివారం ఉదయం మరో ప్రకటనలో పవన్ పర్యటన రద్దు విషయాన్ని వెల్లడించారు.

కళ్యాణంలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించాలనుకున్నారు
తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రికి భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. ఏప్రిల్ 6న సీతారాముల కళ్యాణంలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అనివార్య కారణాలతో భద్రాచలంలో పవన్ కళ్యాణ్ రద్దు అయినట్లు ఇంటెలిజెన్స్ డీజీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు కావడంతో ఆయన అభిమానులు, జనసైనికులు నిరాశకు లోనవుతున్నారు.
అమ్మవారి కళ్యాణ వేడుకను వీక్షించాలనుకున్నారు
శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని మిథిలా స్టేడియంలో రాములోరి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి మొదట పవన్ కల్యాణ్ హాజరై స్వామి, అమ్మవారి కళ్యాణ వేడుకను వీక్షించాలనుకున్నారు. శనివారం భద్రాచలం చేరుకుని రాత్రికి అక్కడే బస చేయాలని పవన్ భావించారు. ఆదివారం జరిగే కళ్యాణ వేడుకల అనంతరం సాయంత్రం వరకు పవన్ కల్యాణ్ భద్రాచలంలోనే ఉండనున్నారని అధికారులు ప్రొటోకాల్ ఏర్పాట్లు సైతం చేశారు.
Read Also: బాబు జగ్జీవన్ రామ్‌కి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు