టాప్ 10 లిస్ట్ నుండి అంబానీ అవుట్

Mukesh Ambani: టాప్ 10 లిస్ట్ నుండి అంబానీ అవుట్

వ్యాపార ప్రపంచంలో ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంది. ఏంటంటే దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో లిస్టులో చోటు కోల్పోయారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆయన నికర ఆస్తుల విలువ లక్ష కోట్లు తగ్గడంతో ఇలా జరిగింది. ఈ సమాచారం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ద్వారా వెల్లడైంది. మరోవైపు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఎప్పటిలాగే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఐటీ కంపెనీ HCLకి చెందిన రోష్ని నాడార్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ ధనవంతురాలైన మహిళగా నిలిచారు. ఆమె ఆస్తులు రూ.3.5 లక్షల కోట్లకు పైమాటే. ప్రపంచంలోని టాప్ 10 మహిళలలో చోటు దక్కించుకున్న మొదటి భారతీయ మహిళ కూడా రోష్ని నాడార్.

Advertisements
టాప్ 10 లిస్ట్ నుండి అంబానీ అవుట్

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్
ముఖేష్ అంబానీ ఇప్పటికీ భారతదేశం అలాగే ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ప్రస్తుతం అంబానీ కుటుంబం ఆస్తుల విలువ 8.6 లక్షల కోట్లు. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే అతని సంపద దాదాపు 13 శాతం అంటే రూ. లక్ష కోట్లు తగ్గింది. మరోవైపు గౌతమ్ అదానీ ఇంకా అతని కుటుంబ సంపద 13% పెరిగింది. గత ఏడాది కాలంలో అదానీ నికర ఆస్తుల విలువ లక్ష కోట్లు పెరిగింది.
టాప్ 10 లో ఎవరు ఉన్నారు
సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ సంపద 21% పెరిగి ఇప్పుడు అతని సంపద రూ.2.5 లక్షల కోట్లుగా ఉంది. అతను ఈ లిస్టులో నాల్గవ స్థానాల్లో ఉన్నారు. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ రూ.2.2 లక్షల కోట్లతో ఐదవ స్థానంలో, కుమార్ మంగళం బిర్లా రూ.2 లక్షల కోట్లతో ఆరో స్థానంలో ఉండగా 2 లక్షల కోట్ల నికర విలువతో సైరస్ పూనావాలా ఆరో స్థానంలో ఉన్నారు.

Related Posts
Shashi Tharoor: మోడీపై ప్ర‌శంస‌లు కురిపించిన శ‌శి థ‌రూర్‌
మోడీపై ప్ర‌శంస‌లు కురిపించిన శ‌శి థ‌రూర్‌

ప్ర‌ధాని మోదీపై మ‌రోసారి ప్ర‌శంస‌లు కురిపించారు కాంగ్రెస్ నేత శ‌శి థ‌రూర్‌. కోవిడ్ స‌మ‌యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ దేశాల‌తో టీకా దౌత్యాన్ని నిర్వ‌హించిన Read more

Delhi Exit Poll : సర్వేలు ఏమంటున్నాయంటే..!!
Delhi Exit Polls 2025

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ 6గంటలకు ముగిసింది. నార్త్‌-ఈస్ట్‌ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్‌ నమోదుకాగా.. Read more

IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్
IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్

ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, Read more

అదానీ వివాదంపై యుఎస్ నుండి భారతదేశానికి ఎలాంటి సమాచారం లేదు.
Gautam Adani

భారతదేశం, అదానీ గ్రూప్ మరియు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మధ్య న్యాయ వ్యవహారంపై ఇప్పటివరకు యుఎస్ నుండి ఎలాంటి కమ్యూనికేషన్ అందుకోలేదని విదేశీ వ్యవహారాల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×