టాప్ 10 లిస్ట్ నుండి అంబానీ అవుట్

Mukesh Ambani: టాప్ 10 లిస్ట్ నుండి అంబానీ అవుట్

వ్యాపార ప్రపంచంలో ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంది. ఏంటంటే దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో లిస్టులో చోటు కోల్పోయారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆయన నికర ఆస్తుల విలువ లక్ష కోట్లు తగ్గడంతో ఇలా జరిగింది. ఈ సమాచారం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ద్వారా వెల్లడైంది. మరోవైపు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఎప్పటిలాగే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఐటీ కంపెనీ HCLకి చెందిన రోష్ని నాడార్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ ధనవంతురాలైన మహిళగా నిలిచారు. ఆమె ఆస్తులు రూ.3.5 లక్షల కోట్లకు పైమాటే. ప్రపంచంలోని టాప్ 10 మహిళలలో చోటు దక్కించుకున్న మొదటి భారతీయ మహిళ కూడా రోష్ని నాడార్.

Advertisements
టాప్ 10 లిస్ట్ నుండి అంబానీ అవుట్

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్
ముఖేష్ అంబానీ ఇప్పటికీ భారతదేశం అలాగే ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ప్రస్తుతం అంబానీ కుటుంబం ఆస్తుల విలువ 8.6 లక్షల కోట్లు. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే అతని సంపద దాదాపు 13 శాతం అంటే రూ. లక్ష కోట్లు తగ్గింది. మరోవైపు గౌతమ్ అదానీ ఇంకా అతని కుటుంబ సంపద 13% పెరిగింది. గత ఏడాది కాలంలో అదానీ నికర ఆస్తుల విలువ లక్ష కోట్లు పెరిగింది.
టాప్ 10 లో ఎవరు ఉన్నారు
సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ సంపద 21% పెరిగి ఇప్పుడు అతని సంపద రూ.2.5 లక్షల కోట్లుగా ఉంది. అతను ఈ లిస్టులో నాల్గవ స్థానాల్లో ఉన్నారు. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ రూ.2.2 లక్షల కోట్లతో ఐదవ స్థానంలో, కుమార్ మంగళం బిర్లా రూ.2 లక్షల కోట్లతో ఆరో స్థానంలో ఉండగా 2 లక్షల కోట్ల నికర విలువతో సైరస్ పూనావాలా ఆరో స్థానంలో ఉన్నారు.

Related Posts
ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ కొత్త వ్యాపారం..
ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ కొత్త వ్యాపారం..

ఇటీవలి కాలంలో భారతదేశంలోని అనేక కంపెనీలు గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో కొత్త పెట్టుబడులు పెడుతున్నాయి. భవిష్యత్తులో ఈ రంగాల్లోని కంపెనీలకు మంచి భవిష్యత్తు ఉండటంతో Read more

భారత్‌లోకి ఎయిర్ అంబులెన్సులు
భారత్‌లోకి ఎయిర్ అంబులెన్సులు

ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ఎక్కడైనా జరిగే ప్రమాదాలకు స్పందించడానికి అంబులెన్సు సేవలను పొందడం కీలకమైన విషయం. కానీ, రోడ్డు మార్గాలు, ట్రాఫిక్, మరియు ఇతర అనేక సమస్యల కారణంగా, Read more

ఆపిల్ కొత్త AI ప్లాట్‌ఫారమ్‌తో వాల్ టాబ్లెట్ మార్చి లో లాంచ్
apple success story

ప్రపంచ ప్రసిద్ధ టెక్ కంపెనీ ఆపిల్, వచ్చే మార్చి నెలలో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాల్ టాబ్లెట్‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ కొత్త పరికరం Read more

Harvard: హార్వర్డ్‌ యూనివర్సిటీకి భారీ కోత విధించిన ట్రంప్
హార్వర్డ్‌ యూనివర్సిటీకి భారీ కోత విధించిన ట్రంప్

హార్వర్డ్‌ యూనివర్సిటీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం షాకిచ్చింది. ట్రంప్ సర్కార్​ జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించడం వల్ల ఆ​ విశ్వవిద్యాలయానికి అందించే 2.2 బిలియన్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×