Allu arjun bail

ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్..భావోద్వేగానికి గుర‌యిన ఫ్యామిలీ

సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టై.. చంచల్‌గూడ జైలులో ఉన్న అల్లు అర్జున్ఈరోజు ఉదయం విడుదల అయ్యారు. జైలు నుండి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అటు నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న ఆయనకు కుటుంబ సభ్యులు భావోద్వేగంతో ఆహ్వానించారు. బన్నీ ఇంటికి చేరుకోగానే కుమారుడు అల్లు అయాన్ పరిగెత్తుకుని తండ్రిని హత్తుకోవడం అందర్నీ కలిచివేసింది.

ఆతరువాత భార్య స్నేహ, కూతురు అర్హతో పాటు తల్లి, ఇతర కుటుంబ సభ్యులను కలుసుకుని బన్నీ ఎమోషనల్ అయ్యారు. కుటుంబం మొత్తం కలిసి ఆయనకు దిష్టి తీసి లోనికి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడిన అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటనను దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించారు. మరొకసారి రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని, ఎవరికీ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరారు. క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు, ఫ్రెండ్స్, సినీ పరిశ్రమ ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

మరోపక్క అల్లు అర్జున్ను రాత్రంతా జైల్లోనే ఉంచడంపై ఆయన తరఫు లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే విడుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టం చేసినా జైలు అధికారులు పట్టించుకోలేదంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే బన్నీని జైల్లో ఉంచారని, ఇది కోర్టు ధిక్కరణే అవుతుందని చెబుతున్నారు.

Related Posts
YS Vivekananda: మా నాన్న కేసులో సాక్షులు చనిపోవడం అనుమానాస్పదమే : సునీత
deaths of witnesses in my father case are suspicious: Sunitha

YS Vivekananda : వైఎస్‌ వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న కేసులో Read more

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్‌..
Arrest warrant issued against former Prime Minister of Bangladesh Sheikh Hasina

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ ఈ వారెంట్ ఇచ్చింది. Read more

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
MLC election campaign

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్నాయి. సాధారణ ఎన్నికలకన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం పూర్తిగా Read more

కుంభమేళా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 1 కోటి ఇవ్వాలి: సమాజ్వాదీ పార్టీ
కుంభమేళా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 1 కోటి ఇవ్వాలి సమాజ్వాదీ పార్టీ

సమాజ్వాదీ పార్టీ నాయకుడు శివపాల్ సింగ్ యాదవ్ బుధవారం ప్రయాగ్రాజ్లోని కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాట ఘటన విషాదకరం అని పేర్కొంటూ విచారం వ్యక్తం చేశారు. ఇందులో Read more