Allu Arjun : అట్లీ భారీ కాంబినేషన్ ఫిక్స్! ₹700 కోట్ల బడ్జెట్‌తో రికార్డ్ స్థాయిలో సినిమా ఎప్పటి నుంచో ఊహాగానాలు, చర్చలు జరిగిన తర్వాత చివరికి అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ ఫిక్స్ అయింది! తొలిసారిగా ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు.ఈ మాసివ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని విషయాలు ఖరారయ్యాయి.నిర్మాతలు డీల్ ఫైనల్ చేసి, త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.తమిళ ఇండస్ట్రీలో పేరుగాంచిన సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఇది వారి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుంది. అల్లు అర్జున్ ఈ సినిమాకు భారీ పారితోషికం అందుకోబోతున్నారు.అలాగే చిత్రంలో ఓ వాటా కూడా ఆయనకు లభించనుంది. మరోవైపు అట్లీ కూడా తన డిమాండ్ చేసిన రెమ్యునరేషన్‌ను ఖరారు చేసుకున్నారు. మొత్తం సినిమా ₹600–700 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనుంది.అట్లీ కెరీర్‌లో ఇదే అతిపెద్ద సినిమా.

ఈ ప్రాజెక్ట్ తొలుత పుష్ప 2 షూటింగ్ సమయంలోనే ప్లాన్ అయింది.కానీ అప్పటి వరకు బడ్జెట్, రెమ్యునరేషన్ సంబంధిత విషయాలపై స్పష్టత లేకపోవడంతో ఆలస్యం అయింది.అయితే పుష్ప 2 బాక్సాఫీస్‌ను షేక్ చేసి, ప్రత్యేకంగా నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ హవాను చాటిన తర్వాత, అట్లీ ఈ ప్రాజెక్ట్‌పై మళ్లీ దృష్టిపెట్టారు.అయితే ముందుగా ₹400 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు ₹700 కోట్ల భారీ స్థాయికి వెళ్లింది.దీని వెనుక కారణం – సన్ పిక్చర్స్ అల్లు అర్జున్ డిమాండ్స్ (₹175 కోట్ల రెమ్యునరేషన్) ను ఓకే చేయడం.ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం – ఇందులో బహుళ హీరోయిన్లు ఉండబోతున్నారు.అందులో ఇద్దరు అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన నటి లు నటించే అవకాశం ఉంది.మ్యూజిక్ పార్ట్ అయితే… అనిరుధ్ రవిచందర్ ది. అట్లీ సినిమాల్లో మ్యూజిక్ హైలైట్ అవుతుందనేది తెలిసిందే.
అలాగే, అనిరుధ్ స్వరపరిచిన ప్రతి ఆల్బమ్ సూపర్ హిట్ అవుతుండటం మరో ప్రత్యేకత.ఈ సినిమా అధికారిక ప్రకటన అల్లు అర్జున్ పుట్టినరోజైన ఏప్రిల్ 8 న జరగనుంది. ఇక రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలవనుంది.ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ – అట్లీ లాంటి ఇద్దరు క్రేజీ టాలెంట్స్ కలిసి వస్తుంటే… రికార్డులు తిరగరాయడం ఖాయం!