ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో వార్తల్లోకి వచ్చారు. బాల్యంలో ప్రతి ఒక్కరిని తెగ ఆకట్టుకున్న భారతీయ సూపర్ హీరో ‘శక్తిమాన్’ (‘Shaktimaan’) కథను వెండితెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేయనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇది నిజమైతే, ఇది ఆయన కెరీర్‌లోనే ఒక కొత్త మలుపుగా నిలిచే అవకాశం ఉంది.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి ‘మిన్నల్ మురళి’ ఫేమ్ బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమా రూపొందనుంది. నిర్మాణ బాధ్యతలను సోనీ పిక్చర్స్ తీసుకోగా, గీతా ఆర్ట్స్, మరికొన్ని అంతర్జాతీయ స్టూడియోలు భాగస్వాములుగా చేరనున్నట్లు తెలుస్తోంది.
పాత శక్తిమాన్‌కి నూతన రూపం
పాత శక్తిమాన్ టీవీ సిరీస్‌లో చూపిన నైతిక విలువలు, హీరోయిజం కొనసాగుతూనే, ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. టెక్నాలజీ పరంగా అత్యంత ప్రగతిశీలంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయట.
పాన్ ఇండియా క్రేజ్‌కి నూతన పుంజు
‘పుష్ప’ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అల్లు అర్జున్, ‘శక్తిమాన్’ పాత్ర ద్వారా తన క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. ఈ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, హాలీవుడ్ టచ్‌తో రూపకల్పన జరుగుతుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి.
ఇతర నటీనటులపై ఇంకా గోప్యతే
అల్లు అర్జున్ ముందు రణ్‌వీర్ సింగ్ ఈ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు బన్నీ పేరు ముందుకు రావడంతో, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నారని టాక్. ఇదే సమయంలో శక్తిమాన్ ఫైనల్ అయితే, అది ఆయన కెరీర్‌లో మారుమూల మైలురాయి అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
Read Also : NEET PG 2025 : నీట్ ఎగ్జామ్ సిటీ ఆప్షన్ మార్చుకోవడానికి నేటి నుంచి ఛాన్స్