ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ గిఫ్ట్ వచ్చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా, బన్నీ నటించనున్న కొత్త సినిమా ‘AA22’కు సంబంధించి అఫీషియల్ ప్రకటన విడుదలైంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న సంస్థ సన్ పిక్చర్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించనుండటం మరో ముఖ్యాంశం.

అట్లీ & అల్లు అర్జున్ – ఫస్ట్ టైమ్ కాంబినేషన్
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌పై గతకొంతకాలంగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అవన్నీ నిజమయ్యాయి. అట్లీ తన సూపర్ హిట్ ‘జవాన్’ తర్వాత నేరుగా ‘AA22’కు దర్శకత్వం వహించనున్నాడు. అల్లు అర్జున్ పుష్ప సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వతా, ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
వీడియోలో హై టైక్ ఎలిమెంట్స్
సన్ పిక్చర్స్ విడుదల చేసిన ప్రకటన వీడియోలో ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నట్లు చూపించారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం, అట్లీ మరియు అల్లు అర్జున్ లాస్ ఏంజెల్స్‌లోని ప్రముఖ VFX సంస్థను సంప్రదించినట్లు తెలియజేశారు. వీఎఫ్ఎక్స్ నిపుణులు కూడా ఇప్పటివరకు ఇలాంటి స్క్రిప్ట్ చూడలేదని చెప్పినట్లు వీడియోలో హైలైట్ చేశారు. వీడియోలో అల్లు అర్జున్ స్క్రీన్ టెస్ట్ విజువల్స్‌ను కూడా చూపించడం అభిమానులకు ఆనందంగా మారింది. బన్నీ లుక్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, పవర్‌ఫుల్ స్టెప్స్ అన్నీ వీడియోలో చిన్న క్లిప్స్ ద్వారా చూపించారు. దాంతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో ఆసక్తి మళ్లీ పెరిగింది. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ మూవీ కాగా, అట్లీకి దర్శకుడిగా ఇది ఆరవ సినిమా. అందుకే AA22xA6 అనే హాష్‌ట్యాగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఒక “ల్యాండ్‌మార్క్ సినిమాటిక్ ఈవెంట్”గా మలచాలని సన్ పిక్చర్స్ భావిస్తోంది. అట్లీ దర్శకత్వంలో వస్తున్న అల్లు అర్జున్ మూవీగా ఇది దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల కావొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే సన్ పిక్చర్స్ పాన్ ఇండియా ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్న సంస్థగా గుర్తింపు పొందింది. అల్లు అర్జున్ ఇప్పటికే హిందీ మార్కెట్‌లో పుష్ప సినిమాతో క్రేజ్ సంపాదించిన తర్వతా, ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ లెవెల్‌లో తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇది అల్లు అర్జున్‌కు 22వ చిత్రం కాగా, అట్లీకి దర్శకుడిగా 6వ మూవీ. ఈ ప్రాజెక్టు సంబంధించి త్వరలో అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
Read also: Allu Arjun: కుటుంబంతో బర్త్ డే జరుపుకున్న అల్లుఅర్జున్..ఫోటోలు వైరల్