రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి గడువు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు

Rahul gandhi: రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి గడువు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పౌరసత్వం అంశంలో కేంద్ర ప్రభుత్వానికి అలహాబాద్‌ హైకోర్టు గడువు నిర్దేశించింది. నాలుగు వారాల్లో పౌరసత్వం అంశం తేల్చాలని సూచించింది. అయితే కేంద్రం- న్యాయస్థానానికి 8 వారాల గడువు కోరగా, నాలుగు వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణను లఖ్‌నవూ బెంచ్‌ ఏప్రిల్‌ 21కి వాయిదా వేసింది. ఆ లోగా స్టేటస్‌ రిపోర్ట్‌ను కేంద్రం కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.
కొన్నేళ్లుగా పౌరసత్వంపై రగడ
రాహుల్‌ గాంధీ పౌరసత్వం అంశంపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. రాహుల్‌ గాంధీ బ్రిటన్‌ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యర్త విఘ్నేశ్‌ శిశిర్ వేసిన పిటిషన్లపై న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది.

రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి గడువు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు

బ్రిటిష్‌ పౌరుడిగా రాహుల్​ గాంధీ
బ్రిటన్‌లో నమోదైన ఓ కంపెనీకి రాహుల్‌ గాంధీ డైరెక్టర్
, సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి కొంత కాలంగా ఆరోపిస్తూనే ఉన్నారు. ఆ కంపెనీ వార్షిక నివేదికలో తనను తాను బ్రిటిష్‌ పౌరుడిగా రాహుల్​ గాంధీ పేర్కొన్నట్లు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. వేరే దేశంలో పౌరుడిగా ఉన్న వ్యక్తి భారత దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందన్నారు. అలా చేయకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 9, భారతీయ పౌరసత్వ చట్టం, 1955ని ఉల్లంఘించడమే అవుతుందని స్వామి పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలో కేంద్రానికి కూడా ఆయన లేఖ రాశారు. మరోవైపు తన వద్ద రాహుల్‌గాంధీ పౌరసత్వానికి సంబంధించి యూకే ప్రభుత్వం సమర్పించిన రికార్డులు ఉన్నాయని విఘ్నేశ్‌ చెబుతున్నారు.

Related Posts
విమాన ప్రమాదం:ఆందోళనలో పలు కుటుంబాలు
plane crash

సౌత్ కొరియాలోని మువాన్ విమానాశ్రయంలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులు తమ Read more

వారేం నేరం చేసారు? సంకెళ్లతో బంధించడం ఏంటి?
వారేం నేరం చేసారు? సంకెళ్లతో బంధించడం ఏంటి?

112 మందికీ అదే పరిస్ధితిఅమెరికా నుంచి భారత్ కు పంపుతున్న విమానాల్లో భారతీయుల్ని చేతులకు బేడీలు, కాళ్లకు సంకెళ్లతో పంపుతున్నారు. గతంలో అమృత్ సర్ కు వచ్చిన Read more

Ranyarao: రన్యా రావుతో ఇద్దరు మంత్రుల లింక్‌.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Ranyarao: బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. రన్యా రావు కేసులో మంత్రుల ప్రమేయం?

నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్‌ అయ్యింది. ఈ కేసు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ Read more

మార్చి 15 నుంచి భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
Temperatures marchi

ప్రత్యేకంగా నార్త్ ఇండియా ప్రాంతంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతను తాకవచ్చు మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఈ ఏడాది వాతావరణం లో జరుగుతున్న మార్పులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *