intermediate

ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్

తెలంగాణలో ఇంటర్ బోర్డు పరిధిలో నిరభ్యంతర పత్రం (NOC) సమర్పించకపోవడం వల్ల ఫీజు చెల్లించలేకపోయిన దాదాపు 217 కళాశాలల్లోని సుమారు 50 వేల మంది ఇంటర్ విద్యార్థులకు హైకోర్టు నుంచి ఊరట దక్కింది. ఇంటర్ పరీక్ష ఫీజును రూ.2,500 ఆలస్య రుసుంతో చెల్లించేందుకు శనివారం (జనవరి 25) చివరితేదీ కాగా.. ఈ ఆలస్య రుసుం లేకుండానే చెల్లించేందుకు అనుమతించాలని ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

Advertisements

అసలేం జరిగింది?
రాష్ట్రంలో గుర్తింపు పొందని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ.. ఒక్కొక్కరికీ రూ.2,500 చొప్పున బ్యాంకు గ్యారంటీని సమర్పించాలని ఆయా కళాశాలల యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. కళాశాలలు నిరభ్యంతర పత్రం సమర్పించడానికి తగినంత గడువు ఇచ్చినప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించి సకాలంలో విద్యార్థులకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఇవ్వలేదని, ప్రస్తుతం ఇంటర్‌ బోర్డు విధించిన రూ.లక్ష జరిమానా మొత్తానికి మినహాయింపు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ టి.వినోద్‌ కుమార్ విచారణ చేపట్టారు.

ప్రస్తుతం గుర్తింపులేని ఈ కాలేజీల్లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులను మార్చిలో పరీక్షలకు అనుమతించడానికిగాను ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లిస్తామని, విద్యార్థులకు ఆలస్య రుసుం రూ.2,500 మినహాయించాలని కోరుతున్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజును అనుమతించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఆయా కాలేజీలు ప్రభుత్వం విధించిన జరిమానాను 25 లోగా చెల్లించాల్సి ఉందన్నారు.

Related Posts
వరంగల్‌లో బ్యాంకు ఉద్యోగి దారుణ హత్య
A bank employee was brutally murdered in Warangal

వరంగల్ : వరంగల్ నగరంలో పట్టపగలే హత్య చేసి మృతదేహాన్ని కారులో పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. కాళ్లకు తాళ్లు కట్టి హత్య చేసి.. కారులో పెట్టి Read more

ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో మొత్తం 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనితో, ఏపీకి ఐదు, తెలంగాణకు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు Read more

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. మరో బీఆర్‌ఎస్‌ నేతకు నోటీసులు జారీ
Former MLA Jaipal Yadav

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటీకే బీఆర్‌ఎస్‌ నేత కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం జూబ్లీహిల్స్‌ పోలీసుల Read more

తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలు: TSPSC అన్ని ఏర్పాట్లు పూర్తి
group 3

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17 మరియు 18 తేదీల్లో నిర్వహించబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక కమిషన్ (TSPSC) Read more

×