ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం

ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం

నటుడు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఆయనతో పాటు అమల అక్కినేని, అలాగే ఇటీవల పెళ్లి చేసుకున్న కొత్త జంట నాగ చైతన్య, శోభిత ధూళిపాల కూడా ప్రధానమంత్రిని కలవడానికి పార్లమెంటును సందర్శించారు. అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రపై రాబోయే పుస్తకం గురించి వారు మోదీతో చేర్చించినట్లు తెలుస్తుంది. వారి పర్యటన సందర్భంగా పార్లమెంటు ప్రాంగణాన్ని కూడా సందర్శించారు. సందర్శన అనంతరం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisements
ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం

ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ, అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రస్తావిస్తూ, భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. ఈ వ్యాఖ్యల తర్వాత, అక్కినేని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీ వెనుక మరేదైనా ముఖ్యమైన కారణం ఉందా అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. సినీ రంగానికి సంబంధించి ప్రభుత్వ సహకారం గురించి కూడా వారు చర్చించి ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. మరోవైపు, నాగ చైతన్య, శోభిత ధూళిపాల కలిసి మోదీని కలవడం ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు.

Related Posts
BJP: బీజేపీ కూటమికి గుడ్‌బై చెప్పిన కేంద్రమంత్రి పార్టీ
BJP: బీజేపీ కూటమికి గుడ్‌బై చెప్పిన కేంద్రమంత్రి పార్టీ

ఆర్ఎల్జీపీ ఎన్డీయే నుంచి నిష్క్రమణ: దళితుల పట్ల నిర్లక్ష్యం ప్రధాన కారణం ఎన్డీయే కూటమిలో దశాబ్దకాలంగా భాగస్వామిగా కొనసాగిన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP), కేంద్రంలోని Read more

ఆదాయపు పన్నుపై పరిమితి పెంచిన కేంద్రం
budget

బడ్జెట్ లో వేతన జీవులకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచింది. రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు Read more

Boma Akhila Priya : భూమా అఖిలప్రియ నిరసన
akhila priya prostest

టీడీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇవాళ దిన్నెదేవరపాడు వద్ద సాక్షి కార్యాలయం ఎదుట కోళ్లతో నిరసన తెలిపారు. గతంలో విలేకరుల సమావేశంలో పేపర్‌లో వచ్చే ధరకే Read more

TG Inter Result 2025: తెలంగాణలో రేపే ఇంటర్‌ ఫలితాలు
TG Inter Result 2025: తెలంగాణలో రేపే ఇంటర్‌ ఫలితాలు

ఇంటర్‌ విద్యార్థులకు ముహూర్తం సన్నాహాలు పూర్తి.. రేపే ఫలితాల విడుదల! తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు శుభవార్త. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌, సెకండ్ Read more

Advertisements
×