భారత్ రక్షణ వ్యవస్థలో కీలక నేత, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ (Ajit Doval) ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంలో విదేశీ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ గట్టి వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ దాడుల్లో భారత్‌కు భారీ నష్టం జరిగిందన్న విదేశీ మీడియా కథనాలు పూర్తిగా నిరాధారమని ఆయన స్పష్టం చేశారు.

చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్‌లో స్వదేశీ రక్షణ సాంకేతికతను వినియోగించినట్లు చెప్పారు. మన సైన్యం పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిందని అన్నారు.
ఒక్క ఆధారం చూపించండి – ధైర్యవంతమైన సవాల్
అజిత్ దోవాల్ (Ajit Doval), భారత్‌కు నష్టం జరిగినట్లు ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదని, నిజంగానే నష్టం జరిగిందని భావిస్తే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో భారత్ బలగాలు పీవోకే, పాక్ సరిహద్దుల్లో (borders of Pakistan) ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి ధ్వంసం చేశాయి అని పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంపై దృష్టి
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఆయుధ సంపత్తిని దేశీయంగా రూపొందిస్తోందని అజిత్ దోవల్ తెలిపారు. మన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్‌లోని పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయని అన్నారు. ఢిల్లీ లక్ష్యంగా పాకిస్థాన్ ప్రయోగించిన ఫతాహ్11 బాలిస్టిక్ క్షిపణులను భారత్ బలగాలు మధ్యలోనే సమర్థవంతంగా పేల్చివేశాయని తెలిపారు.
విదేశీ మీడియా కుట్రలపై ప్రజల జాగ్రత్త అవసరం
విదేశీ మీడియా, చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు నష్టం వాటిల్లిందని చేస్తున్న ప్రచారం సరికాదని అన్నారు. అదే సమయంలో పాకిస్థాన్, పీవోకేలలో ఉగ్రవాద స్థావరాలను గుర్తించి మన సైన్యం కచ్చితత్వంతో దాడులు నిర్వహించిందని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి ఫొటోలు కూడా బయటకు వచ్చాయని తెలిపారు .
అజిత్ దోవల్ ఐఏఎస్ అధికారి?
అజిత్ కుమార్ దోవల్ భారత ప్రధానమంత్రికి ఐదవ మరియు ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు (NSA). ఆయన కేరళ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ (IPS) అధికారి మరియు మాజీ భారత నిఘా మరియు చట్ట అమలు అధికారి .
Read hindi news: hindi.vaartha.com
Read also: China: బ్రహ్మపుత్రపై చైనా డ్యామ్ ప్రాజెక్టు – భారత్‌కు ‘వాటర్ బాంబ్’ ముప్పు?