కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కొత్త ఛైర్మన్‌గా అజయ్ కుమార్(ajay kumar)ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అజయ్ కుమార్ 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కాగా, కేరళ క్యాడర్‌కు చెందినవారు. గతంలో ఆయన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. పరిపాలనా అనుభవంతో పాటు కీలక పదవుల్లో కొనసాగిన ఆయనకు UPSC ఛైర్మన్‌గా అవకాశం లభించింది.
65 ఏళ్లు పూర్తయ్యేంతవరకు పదవిలో
అజయ్ కుమార్ పదవీకాలం ఆరు సంవత్సరాల పాటు లేదా ఆయన 65 ఏళ్లు పూర్తయ్యేంతవరకు కొనసాగుతుంది. గత ఛైర్మన్ ప్రీతి సుదాన్ పదవీకాలం ఏప్రిల్ 29తో ముగియడంతో ఈ ఖాళీ ఏర్పడింది. UPSC ఛైర్మన్ పదవి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అజయ్ కుమార్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు కూడా ఈ మార్పును ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.
అజయ్ కుమార్ అనుభవం
UPSC దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసులు, అఖిల భారత సర్వీసులకు సంబంధించిన నియామక పరీక్షలను నిర్వహించే అత్యున్నత సంస్థ. ఇందులో భారత పరిపాలనా సేవ (IAS), భారత పోలీసు సేవ (IPS), విదేశాంగ సేవ (IFS) తదితర సర్వీసులకు ఎంపిక జరగుతుంది. అజయ్ కుమార్ అనుభవం UPSC పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంలో కీలకంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Chandrababu : ఈనెల 25న కుప్పంలో చంద్రబాబు పర్యటన