aishwarya rai

Aishwarya Rai:భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ప్రపంచంలో అత్యంత అందమైన మహిళగా గుర్తింపు పొందిన ఐశ్వర్య రాయ్, తన అందం, అభినయంతో భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకుంది. అనేక సూపర్ హిట్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న ఆమె పుట్టినరోజు నవంబర్ 1. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం 51 ఏళ్ల వయసులో కూడా ఆమె తన అందంతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. తమిళంలో అద్భుతమైన చిత్రాలతో సౌత్ ప్రేక్షకుల మదిలో నిలిచిన ఐశ్వర్య, 1997లో “ఔర్ ప్యార్ హో గయా” చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, చాలా తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది.

27 సంవత్సరాలుగా సినీ రంగంలో కొనసాగుతున్న ఐశ్వర్య, వివిధ దేశాల్లో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. కొన్నాళ్లుగా సినిమాల్లో కనపడకపోయినా, ఆమె సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే పలు సినిమా వేడుకలు, బాలీవుడ్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఉంటుంది. సినిమాల్లో కనిపించకపోయినా, ఐశ్వర్య వాణిజ్య ప్రకటనల ద్వారా వందల కోట్ల ఆదాయం సంపాదిస్తోంది. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరైన ఐశ్వర్య రాయ్, ఏడాదికి రూ.1 కోటికి పైగా సంపాదిస్తుంది తాజా నివేదికల ప్రకారం, ఐశ్వర్య తన చిత్రం కోసం రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుంది. అలాగే అనేక బ్రాండ్లకు ఆమె అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. రోజుకు దాదాపు రూ.6-7 కోట్లు సంపాదించే ఐశ్వర్య పలు కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. 2021లో పోషకాహార సేవల కంపెనీలో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టిన ఆమె, ఇప్పటికే బెంగళూరులోని ఎన్విరాన్‌మెంటల్ స్టార్టప్‌లో కూడా పెట్టుబడి పెట్టింది ఇదిలా ఉండగా, ఇటీవల ఐశ్వర్య వ్యక్తిగత జీవితంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకుంటున్నారని, ఆమె కూతురు ఆరాధ్యతో ఒంటరిగా జీవిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు.

Related Posts
టాక్సిక్ మూవీ విడుదల ఎప్పుడంటే?
టాక్సిక్ మూవీ విడుదల ఎప్పుడంటే

"కేజీఎఫ్" ఫేమ్ యష్ నటిస్తున్న తాజా చిత్రం"టాక్సిక్"ఎంతగానో ఆసక్తిగ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో గ్రాండ్‌గా జరుగుతోంది మరియు ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతా Read more

శ్రీలీల రిజెక్ట్ చేసిన సినిమాలో పూజాహెగ్డే గ్రీన్‌సిగ్న‌ల్‌
pooja hegde

టాలీవుడ్, బాలీవుడ్, తమిళ సినిమాల్లో వరుసగా కనిపిస్తున్న నటి శ్రీలీల ఇప్పటి వరకు తమిళ సినిమా పరిశ్రమలో తన ముద్రను నిలిపిన విషయం తెలిసిందే. టాలీవుడ్ సినిమాల Read more

ఓటీటీలోకి త‌మ‌న్నా మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ
dileep and tamannaah in a still from bandra 277

దక్షిణాది స్టార్ హీరోయిన్ తమన్నా తన మలయాళ డెబ్యూ చిత్రం బాంద్రా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద Read more

మలయాళం మెగాస్టార్ లైన్ మార్చారా.!
mammootty

ప్రయోగాలు చేయడంలో నమ్మకం ఉంచే హీరో మమ్ముక్కా, ఆడియన్స్‌కు ఎల్లప్పుడూ ఫ్రెష్ ఫీల్‌ని ఇవ్వాలని భావిస్తాడు. అతని రీసెంట్ చిత్రాలు, అలాగే ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *