ఇటీవల బ్రిటన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-35బి లైట్నింగ్ II (F-35B Lightning II) స్టెల్త్ యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ కావడం విమానయాన రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 14న అత్యవసర ల్యాండింగ్ చేసిన ఈ విమానం అక్కడే ఆగిపోయింది. కారణం? ఓ సాంకేతిక లోపం.ఈ అత్యాధునిక యుద్ధవిమానంలో హైడ్రాలిక్ (Hydraulics in a fighter jet) వ్యవస్థలో లోపం తలెత్తింది. దాంతో, బ్రిటిష్ నేవీకి చెందిన ఇంజినీర్లు సమస్యను పరిష్కరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఆ లోపం ఇంకా పూర్తిగా సరి కాలేదు. ఈ కారణంగానే విమానం అక్కడే నిలిచిపోయింది.
ఎయిరిండియా హ్యాంగర్ ఆఫర్‌కు నో చెప్పిన బ్రిటన్
విమానాన్ని మరమ్మత్తుల నిమిత్తం హ్యాంగర్‌కు తరలించేందుకు ఎయిరిండియా ముందుకు వచ్చింది. కానీ, బ్రిటన్ రాయల్ నేవీ ఆ ఆఫర్‌ను నిశ్చితంగా తిరస్కరించింది. ఎందుకంటే ఈ ఎఫ్-35బి విమానంలో అత్యంత రహస్యమైన సాంకేతిక సమాచారం ఉంది. వాటిని బయటకు వెళ్లకుండా చూసుకోవడం బ్రిటన్‌కు అత్యవసర బాధ్యతగా మారింది.ఈ విమానంలో ఉన్న సెన్సార్‌లు, స్టెల్త్ టెక్నాలజీ ఇతర దేశాల చేతికి చేరకూడదనే ఆందోళనతోనే హ్యాంగర్‌లోకి తరలించడాన్ని నిరాకరించారని విశ్లేషకులు అంటున్నారు. భద్రతా కారణాల వల్ల వారు విమానాన్ని బహిరంగ ప్రదేశంలోనే పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, చివరికి పరిస్థితుల దృష్ట్యా హ్యాంగర్‌కు తరలించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
ఇండో-పసిఫిక్ మిషన్‌లో భాగంగా భారత పరిసరాల్లో
ఈ విమానం యూకేకు చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా భారత్ సమీప సముద్రాల్లో మోహరించి ఉంది. ఇటీవలే ఇది భారత నౌకాదళంతో సంయుక్త వ్యాయామాల్లో పాల్గొంది.తిరువనంతపురంలో ఈ విమానం భారీ ఆసక్తిని కలిగించింది. విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టంగా కొనసాగుతోంది. పైలట్‌తో పాటు రాయల్ నేవీ సాంకేతిక నిపుణులు అక్కడే ఉంటూ మరమ్మత్తుల్లో నిమగ్నమయ్యారు.
Read Also : Polavaram Project : పోలవరం వల్ల భద్రాద్రి ఆలయం మునిగిపోయే ప్రమాదం – ఎమ్మెల్సీ కవిత