AICC Secretary Meenakshi Natarajan reached Hyderabad

హైదరాబాద్‌ చేరుకున్న ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్

మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్‌: ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్‌ రాష్ట్రానికి వచ్చారు. సాదాసీదాగా రైల్లో ఢిల్లీ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌లో మీనాక్షి నటరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన వెంట హర్కర వేణుగోపాల్, ఫహీం, రచమల్ల సిద్దేశ్వర్ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శి గాంధీభవన్‌కు చేరుకున్నారు.

Advertisements
హైదరాబాద్‌ చేరుకున్న ఏఐసీసీ కార్యదర్శి

చీఫ్ గెస్టులుగా మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి

గాంధీభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంకు మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఆఫీసు బేరర్లు సమావేశంలో పాల్గొననున్నారు. ఇన్‌చార్జి హోదాలో మీనాక్షి నటరాజన్ మొదటిసారి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దాంతో ఆమె ఏ విధంగా మాట్లాడనున్నారనే ఆసక్తి పార్టీ నేతల్లో నెలకొంది.

రాష్ట్ర నేతల పరిచయ కార్యక్రమం మాత్రమే

అయితే ఈ సమావేశం మీనాక్షి నటరాజన్‌తో రాష్ట్ర నేతల పరిచయ కార్యక్రమం మాత్రమేనని, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. బీసీలకు తగిన న్యాయం చేయాలని పార్టీలోని బీసీ నేతలు మీనాక్షి నటరాజన్‌ను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. మీటింగ్ అయిపోయిన వెంటనే ఏఐసీసీ కార్యదర్శి తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

Related Posts
CM Revanth : సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికిన జపాన్ మేయర్
revanth japan

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు కలిసి ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి Read more

Mobile Phones: తెలంగాణలో మొబైల్ ఫోన్ల విస్ఫోటనం – జనాభా కంటే అధికం!
తెలంగాణలో మొబైల్ ఫోన్ల విస్ఫోటనం – జనాభా కంటే అధికం!

తెలంగాణ‌లో రోజురోజుకూ మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌నాభా కంటే మొబైల్ ఫోన్లు అధికంగా ఉన్నాయి. టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) Read more

Six Guarantees : ఆరు గ్యారంటీలు నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం – శ్రీధర్ బాబు
telangana congress 6 guaran

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. లగచర్ల ఘటన వెనుక ఎవరున్నారో ప్రజలకు Read more

San Diego Zoo : శాన్ డియాగో జూలో భూకంపం ఏనుగుల వింత ప్రవర్తన!
San Diego Zoo శాన్ డియాగో జూలో భూకంపం ఏనుగుల వింత ప్రవర్తన!

ఈరోజు తెల్లవారుజామున అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో భూమి కంపించింది రిక్టర్ స్కేలు ప్రకారం దీని తీవ్రత 5.2గా నమోదైంది. ప్రకృతి ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇంటి వెలుపలికి Read more

×