అత్యంత అరుదైన వ్యాధితో మరణం అంచున ఉన్న ఒక అమెరికన్ పౌరుడికి కృత్రిమ మేధ (ఏఐ ) కొత్త జీవితం ప్రసాదించింది. వైద్యులు వైద్యం చేయలేమని చేతులెత్తేసిన వేళ, వినూత్నమైన ఏఐ ఆధారిత చికిత్స ద్వారా అతని ప్రాణాలు నిలుపుకోగలిగారు. ఈ అద్భుత ఘటన అమెరికా వాషింగ్టన్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన వైద్య రంగంలో ఏఐ ప్రాముఖ్యత ను మరోసారి రుజువు చేసింది.
పోయెమ్స్ సిండ్రోమ్
జోసెఫ్ కోట్స్ అనే అమెరికన్ యువకుడు పోయెమ్స్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది ఒక ప్రాణాంతక వ్యాధి, దీని ప్రభావం శరీరంలోని వివిధ అవయవాలపై పడుతుంది. ఈ వ్యాధి కారణంగా కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం,గుండె వ్యాకోచించింది,మూత్రపిండాలు ఫెయిలవడం వంటి తీవ్రమైన సమస్యలు వచ్చాయి.ఈ పరిస్థితిలో సాంప్రదాయ వైద్య చికిత్సలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. జోసెఫ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, అతడిని రక్షించడం తమ చేతిలో లేదని వైద్యులు ప్రకటించారు.
కృత్రిమ మేధ సాయం
జోసెఫ్ కుటుంబం కూడా అతని ఆరోగ్యంపై ఆశలు వదిలేసిన వేళ, అతని ప్రియురాలు తారా థెబాల్డ్ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆమె వైద్యరంగంలో కృత్రిమ మేధ సాయంపై పరిశోధన చేస్తున్న ఫిలడెల్ఫియా వైద్యుడు డాక్టర్ డేవిడ్‌ను ఆశ్రయించింది.తన ప్రియుడి పరిస్థితిని వివరిస్తూ, కొత్త మార్గాలను వెతకాలని కోరుతూ డాక్టర్ డేవిడ్‌కు ఈమెయిల్ పంపింది. ఈ అంశాన్ని గమనించిన డాక్టర్ డేవిడ్, కృత్రిమ మేధను ఉపయోగించి జోసెఫ్‌కు సరైన చికిత్స అందించేందుకు ప్రయత్నించారు.

ఏఐ సూచించిన వైద్యం
కృత్రిమ మేధ విశ్లేషణ ఆధారంగా, డాక్టర్ డేవిడ్ తదుపరి చికిత్స విధానాన్ని రూపొందించారు.ఏఐ సూచించిన విధంగా:కీమోథెరపీ,ఇమ్యునోథెరపీ,స్టెరాయిడ్స్ చికిత్స,వైద్యులు ఈ సూచనలను అనుసరించి జోసెఫ్‌కు చికిత్స అందించారు. ఒక్క వారం రోజుల్లోనే అతడి ఆరోగ్యం మెరుగుపడటం గమనించారు.
వైద్యరంగంలో విప్లవం
సాంప్రదాయ వైద్యం ఫలించని స్థితిలో, ఏఐ కొత్త మార్గాలను సూచించగలగడం,రోగుల వ్యక్తిగత డేటాను విశ్లేషించి అత్యంత సమర్థవంతమైన చికిత్స అందించడం,ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో వైద్యులకు సహాయపడడం.జోసెఫ్ కోట్స్ ప్రాణాలను ఏఐ సాంకేతికత సరికొత్త వైద్యపరమైన పరిష్కారంతో రక్షించింది. ఇది వైద్య రంగంలో కృత్రిమ మేధ ప్రాముఖ్యతను మరింత స్పష్టంగా చూపిస్తోంది. భవిష్యత్తులో ఏఐ మరిన్ని ప్రాణాలను కాపాడేందుకు మార్గదర్శకంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.