అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఏఐ-171 విమాన ప్రమాదం బాధితులకు పరిహారం అందించడంలో జరుగుతున్న ఆలస్యంపై అమెరికాకు చెందిన ప్రముఖ న్యాయవాది మైక్ ఆండ్రూస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో మొత్తం 65 కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆండ్రూస్, ఈ ఆలస్యానికి సంబంధించి అధికార వర్గాల నిర్లక్ష్యాన్ని, బాధితుల పట్ల చూపుతున్న ఉదాసీన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.ఆండ్రూస్ మాట్లాడుతూ, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందిన పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా బతికి ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడేవి కావని స్పష్టం చేశారు. రతన్ టాటా మానవత్వం, ఉద్యోగుల పట్ల చూపిన ప్రేమ, శ్రద్ధలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. “ఆయన ఉన్నప్పుడు అధికారిక అడ్డంకులు, అనవసరమైన ఆలస్యాలు ఉండేవి కావు. బాధితుల పట్ల తక్షణమే స్పందించి సాయం అందించేవారు” అని పేర్కొన్నారు.
ఆండ్రూస్ అభిప్రాయం ప్రకారం
ఈ ఆలస్యం వల్ల బాధితుల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించేందుకు ఒక వృద్ధురాలి ఉదాహరణను ఆండ్రూస్ ప్రస్తావించారు. ప్రమాదంలో తన ఏకైక కుమారుడిని కోల్పోయిన ఆమె, ప్రస్తుతం మంచానికే పరిమితమై జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఆమెకు ఇప్పటికీ పరిహారం అందకపోవడం వల్ల, ఆమె జీవితం మరింత కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.మైక్ ఆండ్రూస్ (Mike Andrews) అభిప్రాయం ప్రకారం, ఈ ఆలస్యం కేవలం న్యాయపరమైన సమస్య కాదు, ఇది మానవతా పరమైన వైఫల్యం కూడా. బాధితుల కుటుంబాలకు సమయానుకూలంగా ఆర్థిక సహాయం అందించకపోవడం వల్ల, వారు మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటున్నారు. అనవసరమైన పత్రాల పరిశీలన, విభాగాల మధ్య తగిన సమన్వయం లేకపోవడం వంటి కారణాలతో ఈ ప్రక్రియ లాగబడుతోందని ఆయన ఆరోపించారు.

అమెరికాలో తయారీదారుపై ప్రొడక్ట్ లయబిలిటీ
ఈ ప్రమాదంలో బాధితులకు న్యాయం కల్పించేందుకు ఉన్న చట్టపరమైన మార్గాలను కూడా ఆండ్రూస్ వివరించారు. విమానంలోని FADEC వ్యవస్థ వంటి సాంకేతిక లోపాల వల్లే ప్రమాదం జరిగిందని విచారణలో తేలితే.. అమెరికాలో తయారీదారుపై ప్రొడక్ట్ లయబిలిటీ క్లెయిమ్ (Product Liability Claim) దాఖలు చేయవచ్చని ఆయన తెలిపారు. ఒకవేళ ఈ ప్రమాదానికి ఎయిర్ ఇండియాయే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తే.. మాంట్రియల్ కన్వెన్షన్ నిబంధనల ప్రకారం పరిహారం క్లెయిమ్ చేయవచ్చని వివరించారు.ఎయిర్ ఇండియా ఇప్పటికే 147 మంది బాధితుల కుటుంబాలకు మధ్యంతర పరిహారం కింద రూ.25 లక్షలు విడుదల చేసిందని,
బాధితులకు సరైన సమయంలో న్యాయం
అయితే టాటా గ్రూప్ ఏర్పాటు చేసిన ‘ది ఏఐ-171 మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్’ ద్వారా ఒక్కో మరణానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. లాయర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో బాధితులకు సరైన సమయంలో న్యాయం, సహాయం అందించడంలో మంచిదని నెటిజెన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి లాయర్ చేసిన ఈ వ్యాఖ్యలపై సదరు సంస్థ స్పందిస్తుందా,లేదా వెంటనే సాయం అందిస్తుందా అనేది చూడాలి.
ఎప్పుడూ విమాన ప్రమాదానికి గురి కాకపోయిన ఎయిర్‌లైన్ ఏది?
హవాయిన్ ఎయిర్‌లైన్స్.
హవాయిన్ ఎయిర్‌లైన్స్ ఎప్పుడు స్థాపించబడింది?
1929లో స్థాపించబడింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: