హైదరాబాద్ (Agriculture) : అంగనవాడీ కేంద్రాల్లో (Anganwadi centers) చదువుకునే పిల్లల ఆరోగ్యం, షోణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆంద్ర ప్రభుత్వ పోషణ్ వాటిక పథకం కింద రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయల తోటలను పెంచాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలుండగా.. మొదటి విడతలో 4500 కేంద్రాల్లో టమాట, వంకాయ, దొండ కాయ, పాలకూర, తోటకూర, మెంతికూరలను పండించేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా.. వీటి విత్తనాలను జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్సీ) పంపిణీ చేయనుంది. పెంపకం అనంతరం వీటిని లబ్దిదారుల వంటల కోసం వినియో గిస్తారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సమయాల్లో వాటిలో నాణ్యత లోపించడం, వాతావారణ పరిస్థితులు కారణంగా అవి సకాలంలో సరైన అందుబాటులో లేకపోవడం, ఒకవేళ ఉన్నా అవి అందుబాటు ధరల్లో ఉండకపోవడంతో వాటిని ఆయా కేందాల్లో చదువకునే పిల్లలకు అందించడం కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితులపై ప్రత్యేకంగా కేంద్రం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పోషణ్ వాటిక పథకం అమలుపై సమీక్ష
సందర్భంగా ఈ అంశాలన్నింటినీ చర్చించి అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం చేపట్టాలని కేంద్రం సూచించింది. దీనికి అవసరమైన విత్తన కిట్లను తయారు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఎన్ఎస్సీకి ఆదేశించింది. వీటిని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తారు. రాష్ట్ర ఉద్యాన అధికారులు కేంద్రాలను సందర్శించి కూరగాయల సాగుకు (vegetable cultivation) అనువైన సౌకర్యాలు కల్పిస్తారు. విత్తనాలు వేసిన తర్వాత వాటి పెంపకాన్ని పర్యవేక్షిస్తారు. ఈ పథకం విజయవంతంగా అమలయితే ఆయా కేంద్రాల్లో ఉండే పిల్లలకు మంచి పోషణ లభించడమే కాకుండా వారికి నాణ్యమైన కూరగాయలను అందించినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :