mahadharna-postponed-in-nallagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన

హైదరాబాద్‌: ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ నేతలు లగచర్ల ఘటనపై వాయిదా తీర్మానం కోరడంతో పాటు తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. లగచర్ల రైతుకు బేడీలు వేసి వైద్య పరీక్షలకు తీసుకెళ్లడం పట్ల విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు గులాబీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దీంతో మార్షల్స్ వారిని అడ్డుకోగా కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అనంతరం పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడం దారుణమన్నారు.టూరిజం మీద చర్చించాల్సిన సమయం ఇది కాదని.. లగచర్ల రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. నెల రోజులు జైల్లో వేసేంత తప్పు ఆ రైతులు ఏం చేశారని ప్రశ్నించారు. రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన సర్కార్..యావత్ తెలంగాణ రైతులను అవమానించిందని హుజురాబాద్ ఎమ్మెల్యే మండిపడ్డారు. కాగా, ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే.

Related Posts
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఐటీ ప్రొఫెషనల్స్ ర్యాలీ
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఐటీ ప్రొఫెషనల్స్ ర్యాలీ

కార్మికుల మనస్తత్వంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అనుకూలంగా ఐటీ ప్రొఫెషనల్స్ మద్దతు తెలియజేశారు. హైదరాబాద్‌లోని Read more

ఆసుపత్రిలో మోహన్ బాబు చికిత్స
mohanbabu hsp

ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న జరిగిన ఘర్షణ కారణంగా ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. Read more

Nadeendla Manohar: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు : నాదెండ్ల మనోహర్
Nadeendla Manohar రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు నాదెండ్ల మనోహర్

Nadeendla Manohar: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు : నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని రాష్ట్ర ఆహార, పౌర Read more

Pawan Kalyan : ఈనెల 28న ప.గో జిల్లాలో పవన్ పర్యటన
Pawan Kalyan మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా Read more