mahadharna-postponed-in-nallagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన

హైదరాబాద్‌: ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ నేతలు లగచర్ల ఘటనపై వాయిదా తీర్మానం కోరడంతో పాటు తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. లగచర్ల రైతుకు బేడీలు వేసి వైద్య పరీక్షలకు తీసుకెళ్లడం పట్ల విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు గులాబీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దీంతో మార్షల్స్ వారిని అడ్డుకోగా కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisements

అనంతరం పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడం దారుణమన్నారు.టూరిజం మీద చర్చించాల్సిన సమయం ఇది కాదని.. లగచర్ల రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. నెల రోజులు జైల్లో వేసేంత తప్పు ఆ రైతులు ఏం చేశారని ప్రశ్నించారు. రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన సర్కార్..యావత్ తెలంగాణ రైతులను అవమానించిందని హుజురాబాద్ ఎమ్మెల్యే మండిపడ్డారు. కాగా, ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే.

Related Posts
హై కోర్టును బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్
Borugadda Anil Kumar Tokara moves High Court with false medical certificate

అమరావతి: బోరుగడ్డ అనిల్ కుమార్ ఏకంగా హైకోర్టును తప్పుదారి పట్టించాడు. తల్లికి అనారోగ్యం అంటూ ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు. గడువు Read more

Saira Banu : నన్ను ఆలా పిలవొద్దు – సైరా బాను
saira banu

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తనను ‘మాజీ భార్య’గా సంబోధించవద్దని స్పష్టం చేశారు. ఇటీవల ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. తాను ఇంకా Read more

“సరస్వతి పవర్” భూములపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
pawan kalyan to participate in palle panduga in kankipadu

అమరావతి: ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరియు ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల Read more

పార్లమెంట్‌లో విపక్షాల నిరసన..స్పీకర్‌ ఆగ్రహం
Opposition protest in Parliament angered Speaker

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశాల్లో భాగంగా శనివారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. Read more

×