తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా వరుస రోడ్డు ప్రమాదాలతో అల్లకల్లోలంగా మారింది. జాతీయ రహదారి 44 పై గంటల వ్యవధిలో చోటుచేసుకున్న మూడు వేర్వేరు ప్రమాదాలు జిల్లాను విషాదంలో ముంచేశాయి. ఈ ఘటనలలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా ఆదిలాబాద్ జిల్లా వాసులే కావడం ఆ ప్రాంత ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆదిలాబాద్ జిల్లా – రోల్మామడ టోల్ ప్లాజా వద్ద విషాదం
జాతీయ రహదారి 44 పై ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రోల్మామడ టోల్ ఫ్లాజ్ వద్ద మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నిర్మల్ జిల్లా వివేక్ నగర్ కు చెందిన వెంకటేశ్ (35) మృతి చెందాడు. వెంకటేశ్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అన్వేష్ ఇద్దరు బావ, బావమరిదులు. పని కోసం ఆదిలాబాద్ కు వెళ్లిన వెంకటేశ్ ఆదివారం బావ మరిదితో కలిసి నిర్మల్ కు తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్‌ను సమీప ఆస్పత్రికి తరలించినా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో వెంకటేష్ బావమరిది అన్వేష్‌కు గాయాలు కావడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
కామారెడ్డి జిల్లా – మరో దుర్ఘటన
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తులే ప్రమాదానికి గురవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం కంఠం గ్రామానికి చెందిన అమూల్ (నేవీ ఉద్యోగి) కుటుంబంపై మరో ఘోర ప్రమాదం పడింది. భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా సెలవులు రద్దవడంతో, ఆయన భార్య ప్రణీతతో కలిసి విశాఖపట్నానికి బయలుదేరాడు. మార్గమధ్యలో ప్రయాణిస్తున్న వారి కారు అదుపు తప్పి రోడ్డుపక్కనున్న రైలింగ్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రణీతకు తీవ్ర గాయాలు కాగా, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. అమూల్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా – వరుస ప్రమాదాల్లో బలి
నిర్మల్ జిల్లా నీలాయి పేట వద్ద ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బండి శంకర్ ( 45 ) కూతురు కృతిక ( 22 ) అక్కడి కక్కడే మృతి చెందారు. హైదరబాద్‌లో బీటెక్ చదువుతున్న కృతికకు శనివారం పరీక్షలు పూర్తి కావడంతో వేసవి సెలవుల కోసం ఇంటికి తీసు కురావడానికి తండ్రి శంకర్ హైదరాబాద్‌కు వెళ్లారు. శనివారం రాత్రి కృతికను తీసుకుని ఇంటికి బయలుదేరారు. నిర్మల్ జిల్లా నీలాయిపేట వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారు, రోడ్డు పక్కను ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే శంకర్ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన కృతిక హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది. డ్రైవర్ విలాస్‌కు తీవ్ర గాయాలు కావడంలతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు, కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘోర సంఘటనలపై ప్రజల్లో రోడ్డుపై భద్రతాపరమైన ఆందోళనలు పెరిగాయి. ఈ వరుస ఘటనలపై స్పందించిన పోలీసులు, ఆర్టీఏ అధికారులు రహదారులపై ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పునః సమీక్షిస్తున్నారు.
Read also: Suicide: మానసిక కుంగుబాటుతో రాలిన యువ సాఫ్ట్‌వేర్