Actress Hansika approaches High Court in domestic violence case

Hansika : గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నటి హన్సిక

Hansika: ప్రముఖ నటి హన్సిక తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సోదరుని భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె తల్లిపై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. హన్సిక పిటిషన్‌పై విచారించిన.. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ ఎస్.ఎం.మోదక్‌లతో కూడిన ధర్మాసనం ఆమె సోదరుని భార్యకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేసింది. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ.. టీవీ నటి ముస్కాన్ జేమ్స్‌ను 2020లో వివాహం చేసుకున్నారు.

Advertisements
గృహ హింస కేసు హైకోర్టును

తమపై నమోదైన కేసును కొట్టేయాలంటూ

కొన్ని కారణాల వల్ల 2022లోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇదే సమయంలో హన్సిక సహా సోదరుడు ప్రశాంత్, తల్లి జ్యోతిలపై.. ముస్కాన్ గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరిలో హన్సిక, జ్యోతిలకు ముంబయి సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత విచారణ సాగుతోంది. తమపై నమోదైన కేసును కొట్టేయాలంటూ తాజాగా హన్సికతో పాటు ఆమె తల్లి కూడా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా హన్సిక వెలుగొందారు. అల్లు అర్జున్ సరసన ‘దేశముదురు’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్నారు. అలాగే, కందిరీగ, బిల్లా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అటు తమిళంలోనూ విజయ్, ధనుష్, శింబు వంటి స్టార్ హీరోల సరసన నటించారు. ఆ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ వచ్చింది. పలు సిరీస్‌ల్లోనూ నటించారు. అలాగే, హారర్ జానర్‌లోనూ పలు సినిమాల్లో నటించారు. గార్డియన్, శ్రీ గాంధారి సినిమాల్లో నటించారు.

Related Posts
బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్: ఏపీలో అందుబాటులోకి SWAYAM ప్రోగ్రామ్
Good news for BTech student

కేంద్రం, IIT మద్రాస్ సంయుక్తంగా అమలు చేస్తున్న SWAYAM (స్కిల్ డెవలప్మెంట్) ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా బీటెక్ విద్యార్థులకు 72 రకాల Read more

కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన కిషన్ రెడ్డి కుటుంబం
kishanreddy kubhamela

పుణ్యస్నానం అనంతరం కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా కుంభమేళాలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వద్ద జరుగుతున్న ఈ మహాకుంభమేళాలో మంగళవారం Read more

సంక్రాంతికి మరో 4 స్పెషల్ రైళ్లు
4 more special trains for Sankranti

సంక్రాంతి పండగ సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక చర్యలు చేపట్టింది. రద్దీని తగ్గించడంలో భాగంగా మరో నాలుగు Read more

రాజంపేట జైల్లో ఉన్న పోసాని
రాజంపేట జైల్లో ఉన్న పోసాని

సినీ పరిశ్రమలో వివాదాలు, వర్గ వైషమ్యాలు పెంచేలా చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళాన్ని రేపాయి. ముఖ్యంగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×