Actor Mohan Raj passed away

ప్రముఖ నటుడు మోహన్ రాజ్ కన్నుమూత

తిరువనంతపురం: సినీ పరిశ్రమ మరో అద్భుత నటుడిని కోల్పోయింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ విలన్ మోహన్ రాజ్ తుది శ్వాస విడిచారు. 72 సంవత్సరాల వయసున్న ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. గురువారం మధ్యాహ్నం ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

నటుడు మోహన్ రాజ్ గత కొద్ది నెలలుగా పార్కిన్సన్స్‌ తో బాధపడుతున్నారు. రీసెంట్ గా ఆయనకు గుండె పోటు కూడా వచ్చింది. వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ కొద్ది రోజుల పాటు వైద్యులు ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఇక తమ వల్ల కాదని, ఇంటికి తీసుకువెళ్లాలనని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు తిరువనంతపురం సమీపంలోని ఆయన స్వగ్రామం కంజిరంకులంకు తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన కాసేపటికే ఆయన చనిపోయారు. నటుడు, దర్శకుడు అయిన పి దినేశ్‌ పనికర్‌ మోహన్ రాజ్ మరణ విషయాన్ని ధృవీకరించారు. సోషల్ మీడియా వేదికగా మోహన్ రాజ్ చనిపోయినట్లు వెల్లడించారు. నటుడు మోహన్‌ రాజ్‌ కు భార్య ఉష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మలయాళంలో మోహన్‌ రాజ్‌ ‘కిరిక్కాడాన్‌ జోస్‌’గా బాగా పాపులర్ అయ్యారు. 1989లో సిబి మలయిల్‌ తెరకెక్కించిన ‘కిరీదామ్‌’ చిత్రంతో ఆయన బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. మలయిల్ ఈ సినిమా కోసం చూడ్డానికి భారీగా కనిపించే నటుడి కోసం వెతికాడు. కనీసం 6 ఫీట్ల ఎత్తు ఉండాలని భావించాడు. అప్పుడే ఆయనకు మోహన్ రాజ్ కనిపించారు. అప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అసిస్టెంట్‌ అధికారిక ఉద్యోగం చేస్తున్నారు. అయితే, ఆయనకు సినిమాల పట్ల ఆసక్తి ఉండటంతో ‘మూన్నం మూర’లో నటించారు. ఈ సినిమా చూసి మలయిల్ తన మూవీలో విలన్ క్యారెక్టర్ కు ఆయను సెలెక్ట్ చేశారు. ఈ చిత్రంలో మోహన్ రాజ్ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు.

తనలోని విలనిజాన్ని బయటకు తీసి అందరి చేత ఆహా అనిపించారు. ఈ సినిమాతో ఆయన ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లోనూ ఆయన నటించారు. ‘లారీ డ్రైవర్‌’, ‘స్టువర్టుపురం పోలీస్‌ స్టేషన్‌’, ‘చినరాయుడు’, ‘నిప్పు రవ్వ’, ‘శివయ్య’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘చెన్న కేశవరెడ్డి’, ‘శివమణి’ సహా పలు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. తెలుగులో ఆయన చివరగా మోహన్ బాబు నటించిన ‘శివ శంకర్’ చిత్రంలో కనిపించారు. ఆయన మృతి పట్ల తెలుగు, తమిళం, మలయాళం సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Related Posts
150 గంటల్లో నిర్మిత ఫ్యాక్టరీ భవనాన్ని నిర్మించే సవాలును స్వీకరించిన ఈప్యాక్ (EPACK)ప్రిఫ్యాబ్..
EPACK Prefab took on the challenge of building a factory building in 150 hours

న్యూఢిల్లీ: భారతదేశపు ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) తయారీదారులైన ఈప్యాక్ (EPACK)ప్రిఫ్యాబ్, అధునాతన ప్రిఫ్యాబ్ మరియు పీఈబీ సాంకేతికతను ఉపయోగించి రికార్డు స్థాయిలో 150 గంటల్లో భారతదేశపు అత్యంత Read more

చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ ఎప్పుడంటే?
chiru anil

మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా Read more

నాని మూవీలో ‘మోహన్ బాబు’ ..నిజమేనా..?
mohanbabu nani movie

'దసరా' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్ తర్వాత హీరో నాని - దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో మరో ప్రాజెక్ట్ సిద్ధమైంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో Read more

అల్లుఅర్జున్ ను విడుదల కోసం పోరాడుతా: కేఏ పాల్
ka paul 35d23775f5

సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయకుంటే తాను కోర్టులో పిల్ వేస్తానన్నారు. Read more