Actor Kamal Haasan to be a Rajya Sabha member?

Kamal Haasan : నటుడు కమల్‌ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం ?

Kamal Haasan: విలక్షణ నటుడు , మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ ఎంపీ గా (రాజ్యసభ సభ్యుడిగా) పదవి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. తమిళనాడు లోని కోయంబత్తూర్‌లో నిన్న (సోమవారం) అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మక్కళ్‌ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కమల్‌ హాసన్‌ను రాజ్యసభకు పంపాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని చెప్పారు. 2021 శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న మక్కళ్‌ నీది మయ్యం పార్టీకి.. రాజ్యసభ సీటు ఒకటి కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. డీఎంకేకు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం జులైలో ముగియనుంది. ఈ క్రమంలో ఒక స్థానం కమల్‌ హాసన్‌కు ఇచ్చే అవకాశం ఉంది.

Advertisements
నటుడు కమల్‌ హాసన్‌కు రాజ్యసభ

స్పీడ్‌గా సినిమాలను పూర్తి చేస్తున్న కమల్‌

కాగా, లెజెండరీ యాక్టర్ కమల్‌హాసన్‌ తీస్తున్న సినిమాలను స్పీడ్‌గా పూర్తి చేస్తున్నారు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమాను పూర్తి చేశారు. ఈ మోస్ట్ అవైటెడ్‌ చిత్రం జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే థగ్ లైఫ్ పూర్తి చేసిన వెంటనే కమల్‌ మరో సరికొత్త ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలు త్వరగా పూర్తి చేసుకుని ఆయన రాజ్య సభ పదవి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలియవచ్చింది.

Read Also: రాష్ట్రపతి పాలనలోనే బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు

Related Posts
బీఎల్వోలకు త్వరలో గౌరవ వేతనాలు
AP BLO

ఆంధ్రప్రదేశ్‌లోని 4,638మంది బూత్ లెవల్ ఆఫీసర్ల (BLO)కు త్వరలో గౌరవ వేతనాలు అందించనున్నట్లు సమాచారం. 2021-22 నుంచి వేతనాలు రాకపోవడంతో BLOలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Read more

HCU ఘటనపై మాదాపూర్ డీసీపీ అధికారిక ప్రకటన
Police statement on the HCU

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద చోటుచేసుకున్న ఘటనపై మాదాపూర్ డీసీపీ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కొందరు విద్యార్థులు పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆరోపించినప్పటికీ, అటువంటిదేదీ Read more

తెలంగాణ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ ను వాడేశారు
powerbill

తెలంగాణలో వేసవి ఇంకా ప్రారంభమవ్వకముందే విద్యుత్ వినియోగం రికార్డులు తిరగరాస్తోంది. రాష్ట్ర ప్రజలు 16,293 మెగావాట్ల విద్యుత్ను వినియోగిస్తూ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించారు. ఇటీవల ఫిబ్రవరి Read more

జాతీయ పత్రికా దినోత్సవం: ప్రజాస్వామ్య విలువలను కాపాడే పత్రికలు
national press day 1

ప్రతి సంవత్సరం నవంబర్ 16న జరుపుకునే జాతీయ పత్రికా దినోత్సవం, భారత పత్రికా మండలి (PCI) స్థాపనను గుర్తించేందుకు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. 1966లో స్థాపించిన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×