ప్రముఖ బాలీవుడ్ నటుడు, చిత్రనిర్మాత దేబ్ ముఖర్జీ ముంబైలో కన్నుమూశారు. 83 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో బాలీవుడ్ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. 1960, 70లలో అనేక చిత్రాల్లో నటించిన దేబ్ ముఖర్జీ, “ఏక్ బార్ మూస్కురా దో” (1972), “జో జీతా వోహి సికందర్” (1992), “లాల్ పత్తర్” (1971) వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన కుమారుడు అయాన్ ముఖర్జీ బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడిగా పేరొందారు.
దుర్గా పూజ వేడుక
ముంబై సాంస్కృతిక రంగంలో దేబ్ ముఖర్జీ గణనీయమైన పాత్ర పోషించారు. అక్కడ జరిగే దుర్గా పూజ వేడుకల్లో ఒకటైన నార్త్ బాంబే సర్బోజానిన్ దుర్గా పూజ పండల్ నిర్వాహకులలో ఆయన ఒకరు . కాగా అయాన్ ముఖర్జీ ప్రస్తుతం హృతిక్ రోషన్,జూనియర్ ఎన్టీఆర్ లతో వార్ 2 మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు తండ్రి మరణంతో ఆయన అయాన్ కొన్ని రోజులు వార్ 2 షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
అంత్యక్రియలు
దేబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు ముంబైలోని జుహూ పవన్ హన్స్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. బాలీవుడ్ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ప్రముఖ నటి తనూజ, కాజోల్, రాణీ ముఖర్జీ, నటుడు అజయ్ దేవ్‌గన్, దర్శకుడు ఆదిత్య చోప్రా, అశుతోష్ గోవారికర్, రణ్‌బీర్ కపూర్,ఆలియా భట్ తదితరులు అంత్యక్రియలకు హాజరవుతారని భావిస్తున్నారు.

ఇక అయాన్ ముఖర్జీ ప్రస్తుతం హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న “వార్ 2” సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తండ్రి మృతితో అయాన్ కొన్ని రోజులు షూటింగ్‌కు విరామం ఇచ్చే అవకాశముంది. దేబ్ ముఖర్జీ మృతి బాలీవుడ్ సినీ పరిశ్రమకు తీరని లోటుగా మిగిలింది.బాలీవుడ్ పరిశ్రమ ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తోంది.