యాదాద్రిజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డిఎస్పీ (DSP) లు స్పాట్లోనే దుర్మరణం పాలయ్యారు.
అతివేగమే ప్రమాదానికి కారణం
ఏపీకి చెందిన ఇద్దరు డిఎస్పీలు స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తున్నారు. అతివేగంగా వెనుక నుండి లారీని ఢీకొన్ని వాహనం రోడ్డుపై పల్టీలు కొట్టింది.మితిమీరిన వేగం, నిద్రలేమితో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు చక్రధరరావు, శాంతారావులు (Shantarao) స్పాట్లో మరణించగా అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావుకి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. అయితే డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏపీ నుంచి విచారణ నిమిత్తం యాదాద్రికివెళ్లిన ఇంటలిజెన్స్ అధికారులు, ప్రమాదంలో మరణించడం తీవ్రంగా కలచివేస్తున్నది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎస్పీల మృతికి తీవ్ర సంతాపాన్నివ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏవి?
రోడ్డు ప్రమాదాలకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మూడు ప్రధాన విభాగాల్లో వీటిని వర్గీకరించవచ్చు అవి:మానవ తప్పిదం,వాహన లోపాలు ,పర్యావరణ పరిస్థితులు.
రోడ్డు ప్రమాదం వల్ల కలిగే ప్రభావాలు ఏమిటి?
రోడ్డు ప్రమాదాలు తీవ్రమైన భౌతిక, మానసిక, ఆర్థిక సమస్యలను కలిగిస్తాయి. ముఖ్యంగా, క్రింది విధమైన ప్రభావాలు ఎదురవుతాయి:. శారీరక గాయాలు , మానసిక ప్రభావాలు,ఆర్థిక నష్టం,కుటుంబ జీవితం మీద ప్రభావం.
Read hindi news: hindi.vaartha.com
Read also: CH. Vidyasagar Rao: ప్రాథమికస్థాయి వరకు తెలుగుభాషలో బోధన అవసరం: విద్యాసాగరరావు