Accident in Minister Uttam Kumar Chonvoy in Garidepalle in Suryapet

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి తప్పిన ప్రమాదం

హుజూర్‌నగర్‌: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఉత్తమ్ తన నియోజకవర్గమైన హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడి ఉండటం చూసి మంత్రి కారును ఆపమని డ్రైవర్ కు సూచించారు.

దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకాల ఉన్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనతో కార్ల బానెట్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పిల్చుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ట్రాఫిక్ ఏర్పడింది. అనంతరం మంత్రి కారు వెళ్లిపోవటంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.

image

కాగా, ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కారుకు కూడా పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో వాహనం అదుపుతప్పింది. అయితే వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ముప్పు తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా తిరుమలాయపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం తప్పడంతో సిబ్బంది వెంటనే ఆయన్ని మరో కారులో ఖమ్మంకు తరలించారు.

Related Posts
ఆటో నడిపిన కేటీఆర్‌
KTR drove the auto

హైదరాబాద్‌: ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ..బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వయంగా ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Read more

నేడు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
CM revanth reddy review with higher officials today

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై వివరాలను అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ఇప్పటికే Read more

హోలీ పండుగ విశిష్టత ఏంటి
హోలీ పండుగ విశిష్టత ఏంటి

హోలీ పండుగ భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇది కేవలం రంగుల పండుగ మాత్రమే కాకుండా, అనేక పురాణ గాథలతో ముడిపడి ఉంది. హోలీ Read more

పోసాని కృష్ణమురళికి స్వల్ప అస్వస్థత
పోసాని కృష్ణమురళికి స్వల్ప అస్వస్థత

అసభ్యకర వ్యాఖ్యలతో జైలుపాలైన నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌జైలులో ఉన్న పోసాని ఛాతిలో నొప్పిగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *