Wishing KCR death is cruel.. Harish Rao

Harish Rao : కేసీఆర్ చావు కోరుకోవడం దారుణం : హరీశ్ రావు

Harish Rao : తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్‌ చావును కోరుకోవడం ఎంత దారుణమని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ చావును కోరుతూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హరీష్‌ రావు, దీనికి నిరసనగా శాసనసభలో సీఎం ప్రసంగాన్ని బహిష్కరించినట్లు తెలిపారు.

Advertisements
 కేసీఆర్ చావు కోరుకోవడం దారుణం

అసెంబ్లీలో పూర్తిగా అబద్ధాలు

అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ చేసిన హరీష్‌ రావు, కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పూర్తిగా అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే 299 టీఎంసీల కృష్ణా నీటి పంపకాలు జరిగాయని, నిజానికి తెలంగాణలో అంత నీటిని వినియోగించేందుకు తగినన్ని ప్రాజెక్టులే లేవని అన్నారు. కాంగ్రెస్ ప్రాజెక్టులను నిర్మించలేకపోవడమే ఈ అన్యాయానికి కారణమని పేర్కొన్నారు.

నీటిని కాపాడేందుకు పదవులను వదులుకున్నారు

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో గతంలో కాంగ్రెస్ నేతలు ఒక్కరోజు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదని, అయితే తాము 40 రోజుల పాటు అసెంబ్లీని స్థంభింపజేశామని గుర్తుచేశారు. తెలంగాణ నీటిని కాపాడేందుకు తమ పార్టీ మంత్రుల పదవులను వదులుకున్నా, కాంగ్రెస్ నేతలు మాత్రం చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చి కృష్ణా నీటిపై తాత్కాలిక నిర్ణయాలను ఆమోదించారని ఆరోపించారు.

Related Posts
రోడ్ సేఫ్టీ వీక్: రహదారి భద్రతపై అవగాహన
road safety week

"రోడ్ సేఫ్టీ వారం" ఒక దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రచార కార్యక్రమం, దీని ప్రధాన ఉద్దేశ్యం రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం. రహదారి ప్రమాదాలు, గాయాలు, మరణాలు Read more

రైతుభరోసా పరిమితి, మార్గదర్శకాలు
formers

రైతులకు తమ ప్రభుత్వం మేలుచేస్తున్నదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఆ దిశగా చర్చలను కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా రైతు భరోసా అర్హత .. పరిమితి పైన Read more

డ్రోన్ షోను నిర్వహించిన గోద్రెజ్ ప్రాపర్టీస్
Godrej Properties organized the drone show

హైదరాబాద్‌ : భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటైన గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, హైదరాబాద్‌ నగరం యొక్క సాంస్కృతిక వైభవాన్ని మరియు వారసత్వాన్ని వేడుక జరుపుకునేందుకు Read more

ప్రధాని మోదీ గయానా పార్లమెంట్‌లో ప్రసంగం…
modhi speech

భారత ప్రధాని నరేంద్ర మోదీ గయానా పార్లమెంట్‌లో ప్రసంగించిన సందర్భం దేశాల మధ్య ప్రతిష్టాత్మకమైన దౌత్య సంబంధాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి కావడమే కాక, అతని Read more

×