ACB officials who did not allow KTR's lawyers

కేటీఆర్‌ లాయర్లను అనుమతించని ఏసీబీ..

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న ఫార్మూలా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బంజారాహిల్స్ ఏసిబి వద్ద కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ వెంట లాయర్లను వెళ్లడానికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన వెంట లాయర్లు ఎందుకు రాకుడదు అని కేటీఆర్ అధికారులను ప్రశ్నించారు. దాదాపు అరగంటపాటు అక్కడ ఎదురుచూసిన కేటీఆర్.. చివరికి ఏసీబీ ఆఫీసులోపలికి వెళ్లకుండానే వెనుదిరిగారు.

విచారణకు అడ్వకేట్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీకి కేటీఆర్ న్యాయవాది నోట్ ఇచ్చారు. నోట్ తీసుకున్న ఏసీబీ అధికారులు లాయర్లను వెంట పంపించేందుకు అనుమతించలేదు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్నతన హక్కులను వినియోగించుకోవచ్చునని.. లాయర్లను లోపలికి అనుమతించకపోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీబీ ఆఫీసు నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. అటు నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లి పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు.

అంతకుముందు నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన కేటీఆర్..అక్కడ లీగల్ టీమ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేసుకు సంబంధించి ఏసీబీ చేస్తున్న ఆరోపణలు..వాటికి చెప్పాల్సిన సమాధానాలపై వివరాలను తీసుకున్నారు కేటీఆర్. ఆ తర్వాత బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను కేటీఆర్ కలిశారు. నాయకులతో భేటీ తర్వాత ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు కేటీఆర్. 2022 జులై లో హైదరాబాద్ లో జరిగిన ఈ రేస్ లో ప్రభుత్వ నిధులను కేటీఆఱ్ విదేశీ సంస్థలకు అనుమతులు లేకుండా మళ్లించారంటూ ఆయనపై ఆరోపణలు రాగా..ప్రభుత్వం ఈ కేసులో ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఇక ఇదే కేసులో రేపు ఈడీ విచారణకు కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.

Related Posts
ట్రైడెంట్ గ్రూప్ కర్మయోగి రిక్రూట్ మెంట్ డ్రైవ్‌
Trident Group Karmayogi Recruitment Drive

ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌తో.. సమాజంలో ఉన్న కమ్యూనిటీలపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడం, అదే విధంగా వికసిత్ భారత్ వైపు అడుగులు వేయడం పట్ల తన అంకితభావాన్ని Read more

తాండూరు గిరిజన వసతిగృహంలో భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థినిలు
Female students fell ill af

వికారాబాద్ జిల్లా తాండూరులోని వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థినిలు అనుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని సాయిపూర్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ Read more

కుంభమేళా తొక్కిసలాటపై ప్రధాని మోదీ, సీఎం యోగి దిగ్భ్రాంతి
కుంభమేళా తొక్కిసలాటపై ప్రధాని మోదీ, సీఎం యోగి దిగ్భ్రాంతి

మౌని అమావాస్య నాడు ఉదయం జరిగిన మహా కుంభంలో తొక్కిసలాట తలెత్తడంతో సుమారు 30 మంది మహిళలు గాయపడ్డారు. మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందని తెలుసుకున్న వెంటనే, Read more

ఐఐటీ బాంబేతో ఎస్ఆర్ఐ – నోయిడా అవగాహన ఒప్పందం..
Samsung agreement on digita

అత్యాధునిక పరిశోధనలను నిర్వహించడం, డిజిటల్ ఆరోగ్యం , కృత్రిమ మేధస్సులో తదుపరి తరం సాంకేతికతలను అభివృద్ధి చేయడాన్ని ఈ ఐదేళ్ల భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సహకారం Read more