हिन्दी | Epaper
నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం?

Abhimanyu Easwaran: బీసీసీఐ సెలెక్టర్ల తీరుపై అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ ఆగ్రహం

Anusha
Abhimanyu Easwaran: బీసీసీఐ సెలెక్టర్ల తీరుపై అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ ఆగ్రహం

భారత క్రికెట్ జట్టులోకి కొత్త ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో బీసీసీఐ సెలెక్టర్ల తీరుపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. తాజాగా యువ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran) తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తన కుమారుడి కృషి, అద్భుత ప్రదర్శనలు ఉన్నప్పటికీ అతనికి టెస్టు జట్టులో సరైన అవకాశాలు ఇవ్వడం లేదని, అతనిని మరొక ఆటగాడి కోసం బలి చేశారని వ్యాఖ్యానించారు.అభిమన్యు ఈశ్వరన్ గత మూడేళ్లుగా జట్టు తలుపు తట్టుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో క్రమం తప్పకుండా రాణిస్తున్నప్పటికీ అతనికి ఇప్పటికీ అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైనప్పటికీ ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశాన్ని ఇవ్వకపోవడంపై రంగనాథన్ (Ranganathan Easwaran) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు టెస్టుల సిరీస్‌లోనూ చివరి మ్యాచ్‌లో కూడా మేనేజ్‌మెంట్ అతన్ని పక్కన పెట్టి కరుణ్ నాయర్‌ను ఆడించడం అన్యాయమని అన్నారు.

తుది జట్టులో

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.”అభిమన్యు ఈశ్వరన్ అరంగేట్రం కోసం నేను రోజులు లెక్క పెట్టడం లేదు. ఏకంగా సంవత్సరాలనే లెక్కిస్తున్నాను. ఇప్పటికే మూడేళ్లు పూర్తయింది. ఒక ఆటగాడి బాధ్యత పరుగులు చేయడం. అభిమన్యు అది చేశాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో ఇండియా-ఏ తరఫున రెండు మ్యాచ్‌ల్లో అభిమన్యు రాణించలేదని, అందుకే తుది జట్టులో అవకాశం దక్కలేదని కొందరు అన్నారు. కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Gavaskar Trophy) కి ముందు అభిమన్యు అద్భుతంగా ఆడిన సమయంలో కరుణ్ నాయర్ భారత జట్టులో లేడు. దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ వంటి టోర్నీలను కూడా కరుణ్ నాయర్ ఆడలేదు. అతనికి అవకాశం కూడా దక్కలేదు. గతేడాది నుంచి ఇప్పటి వరకు అభిమన్యు ఈశ్వ‌ర‌న్‌ దేశవాళీ క్రికెట్‌లో 864 ర‌న్స్‌ చేశాడు.

టెస్టు జ‌ట్టు

ఆటగాళ్లను ఎలా పోల్చుతారో నాకు అర్థం కావడం లేదు. కరుణ్ నాయర్‌కు అవకాశం ఇచ్చారు. మంచిదే.. అతను దేశవాళీ క్రికెట్‌లో 800కు పైగా ప‌రులుగు చేశాడు. సెలెక్టర్లు అతనిపై నమ్మకం ఉంచారు. అదే సమయంలో నా కొడుకు కాస్త నిరాశగా కనిపిస్తున్నాడు. అలా జరగడం సహజం. కొందరు ఆటగాళ్లను ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టెస్టు జ‌ట్టులోకి తీసుకున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. టెస్ట్ ఫార్మాట్‌కు జట్టు ఎంపిక చేస్తున్నప్పుడు ఐపీఎల్ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకోకూడదు. టెస్టు జ‌ట్టు ఎంపికకు రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల ప్రదర్శనలే ప్రాతిపదిక కావాలి” అని రంగనాథన్ ఈశ్వరన్ అన్నారు.కాగా, దేశవాళీ క్రికెట్‌‌లో అభిమన్యు ఈశ్వరన్ ఇప్ప‌టివ‌ర‌కు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. 103 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 48.70 సగటుతో 7,841 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

అభిమన్యు ఈశ్వరన్ కుటుంబం గురించి చెప్పండి?

ఆయన తండ్రి రంగనాథన్ ఈశ్వరన్, క్రికెట్ పట్ల అపారమైన అభిమానం కలిగిన వ్యాపారవేత్త. తల్లి రజని ఈశ్వరన్ గృహిణి. తండ్రి సహకారంతోనే అభిమన్యు చిన్నప్పటి నుంచే క్రికెట్‌లో ముందుకు వచ్చారు.

అభిమన్యు ఈశ్వరన్ క్రికెట్ కెరీర్ ఎలా ప్రారంభమైంది?

అభిమన్యు చిన్నతనంలోనే డెహ్రాడూన్‌లోని క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందారు. 2013లో బెంగాల్ జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ టోర్నీల్లో నిరంతరం రాణించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/yuzvendra-chahal-even-if-he-wants-to-commit-suicide-chahals-comments-go-viral/sports/524072/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870