గన్నవరం (విజయవాడ) : గత కొన్ని దశాబ్దాలుగా మన రాష్ట్రం ఉద్యాన ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందని, 15.9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 275.13 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో దేశంలోనే ఐదవస్థానంలో నిలిచిందని రాష్ట్రగవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యన విశ్వ విద్యాలయం 6వస్నాతకోత్సవ కార్యక్రమాన్ని కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో గురువారం ఉదయం నిర్వహించారు. ఈకార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఛాన్సలర్దాలో గవర్నర్ ముఖ్యఅతిధిగా హాజరై బ్యాచిలర్ డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్, పిహెచ్ఎ (Degree, Postgraduate, PHA) పూర్తిచేసిన విద్యార్దులకు పట్టాలు ప్రధానం చేసారు. ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలను గవర్నర్ చేతుల మీదుగా బహుకరించారు.

ఉద్యానపంటలు – ఆహార భద్రతకు అద్భుతమైన దారి
ఈసందర్భంగా గవర్నర్ నజీర్ (Abdul Nazeer) మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఉద్యానపంటల పాత్ర ప్రముఖంగా ఉందన్నారు. ఉద్యాన పంటల సాగులో నూతన పద్దతులు పాటించటం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని ఈదిశగా శాస్త్ర వేత్తలు కృషిచేయాలని సూచించారు. పోషకా హారకొరతను నివారించటంతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచటంలో ఉద్యానరంగం కీలక పాత్రపోషిస్తుందని అభిప్రాయపడ్డారు. 2024 జిడిపిలో వ్యవసాయ అనుబంధరంగాలు దాదాపు 16శాతం వాటాను కలిగి ఉన్నాయని తెలిపారు. వ్యవసాయం కేవలం జీవనోపాధి కాదు అది జీవన విధానం అన్న హరిత విప్లవ పితామహుడు స్వామినాధన్ (Swaminathan) మాటలను ఈసందర్భంగా ఊటంకించారు. మిరప, కోకో, ఆయిల్పామ్, బొప్పాయి, జీడిపప్పు, నారింజ, టమోట, అరటి వంటి అనేక పంటల ఉత్పత్తి, ఉత్పాదకతకు మార్గదర్శకంగా దేశంలోనే ప్రధాన ఉద్యాన కేంద్రంగా మన రాష్ట్రం నిలవ బోతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు.
అల్పకాలంలో విశిష్ట విజయాలు సాధించిన విశ్వవిద్యాలయం
ఈ విశ్వవిద్యాలయం స్థాపించిన అనతి కాలంలోనే ఎందరో విద్యార్ధులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దటం అభినందనీయమన్నారు. ఈవిశ్వవిద్యాలయం ద్వారా 38 రకాల అధికదిగుబడినిచ్చే వంగడాలను అభివృద్దిచేసి రైతులకు అందించినట్లు గవర్నర్ వివరించారు. వీటిలో 31 రకాలను గత రెండు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో సెంట్రల్ వెరైటీ రిలీజ్ కమిటీ అధికారికంగా ప్రకటించిందని గుర్తుచేసారు. విద్యాలయాలు జ్నానంతోపాటు, వ్యక్తిత్వ నిర్మాణానికి పునాధులుగా నిలుస్తాయని, ఇక్కడ నేర్చుకున్న విషయాపరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకుని క్షేత్రస్థాయిలో రైతులకు సాయం అందించాలని సూచించారు. విద్యా ర్దులకు స్నాతకోత్సవం చిరస్మరణీయమైన అనుభూతినిస్తుందని ఈ ఆనందం మరువలేని దన్నారు.
అబ్దుల్ నజీర్ పూర్తి పేరు?
సయ్యద్ అబ్దుల్ నజీర్. ఎస్. అబ్దుల్ నజీర్ (జననం 5 జనవరి 1958) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22వ గవర్నర్. ఆయన భారత సుప్రీంకోర్టు మరియు కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి..
ఏపీ గవర్నర్ ఎవరు?
గవర్నర్ రాష్ట్రానికి అధిపతి మరియు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నర్ రాష్ట్ర ప్రథమ పౌరుడు. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలంటే, ప్రస్తుతం సయ్యద్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Nadendla manohar: ధాన్యం బకాయిలు 659.39 కోట్లు జమ మంత్రి నాదెండ్ల