हिन्दी | Epaper

Aarogyasri : ఏపీలో నేటి నుండి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్..!

sumalatha chinthakayala
Aarogyasri : ఏపీలో నేటి నుండి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్..!

Aarogyasri : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు ఈరోజు నుండి బంద్ అయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు బంద్ కానున్నాయి అంటూ.. ఆరోగ్యశ్రీ కింద పని చేస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటన చేశాయి. దాదాపు 3500 కోట్ల పెండింగ్ బిల్స్ చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఏపీలో నేటి నుండి ఆరోగ్యశ్రీ వైద్య

రాష్ట్ర వ్యాప్తంగా 600 ఆసుపత్రులలో అన్ని వైద్య సేవలు బంద్‌

తమ బిల్లులు వచ్చేవరకు ఆరోగ్యశ్రీ సేవలు.. బందు చేస్తున్నట్లు ప్రకటన చేశాయి. ఎమర్జెన్సీ సేవలు మాత్రమే ఏపీలో కొనసాగులున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 600 ఆసుపత్రులలో ఓపిలతో పాటు అన్ని వైద్య సేవలు కూడా ఆగిపోయాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం సుమారు 2500 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీస్‌

కాగా, నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టంగా మారి సేవలు కొనసాగించే పరిస్థితి లేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీస్‌ ఇచ్చింది. రూ.1,500 కోట్లు విడుదల చేస్తే గానీ సేవలు అందించలేమని పేర్కొంది. బకాయిల కోసం ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి ఏడాది కూడా తిరగకుండానే 26 సార్లు లేఖ రాయడం గమనార్హం.

Read Also: నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870