AAP will contest Delhi assembly elections alone: ​​Kejriwal

ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రానున్న ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు అధికార ఆప్‌ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం 31 మందిని ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో ఆప్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

Advertisements

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. సొంత బలంతో ఎన్నికల్లో గెలుపొందుతుంది. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తుకూ అవకాశం లేదు అని కేజ్రీ వెల్లడించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్‌ సీట్ల పంపకం కోసం ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతోందంటూ వార్తలు వస్తున్నాయి. కూటమిలోని కాంగ్రెస్‌కు 15 సీట్లు, ఇతర పార్టీలకు ఒకటి లేదా రెండు సీట్లు కేటాయించినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన కేజ్రీ.. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా స్పష్టతనిచ్చారు. ఇప్పటికే ఆప్ ఢిల్లీ ఎన్నికల కోసం రెండు విడతలుగా అభ్యర్ధుల జాబితాల్ని కూడా విడుదల చేసింది.

Related Posts
ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలి.. సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్‌ విజ్ఞప్తి..
PCC chief appeals to movie stars to end this controversy

PCC chief appeals to movie stars to end this controversy. హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తుల గురించి చేసిన Read more

తాము చేసిన అభ్యర్థనకు భారత్‌ నుంచి స్పందన రాలేదు: యూనస్‌
We have not received a response from India to our request.. Yunus

ఢాకా: భారత్‌ను మాజీ ప్రధాని షేక్‌ హసీనా అప్పగింతపై అధికారికంగా సంప్రదించినట్లు బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ వెల్లడించారు. కానీ, భారత్‌ నుంచి ఇప్పటివరకు అధికారిక Read more

Bharath, Pakistan: ఇరుదేశాలు యుద్ధ సన్నాహాలకు సిద్ధం..దిగజారుతున్న పాక్ ఆర్థిక పరిస్థితి
ఇరుదేశాలు యుద్ధ సన్నాహాలకు సిద్ధం..దిగజారుతున్న పాక్ ఆర్థిక పరిస్థితి

భారత్, పాకిస్తాన్ మధ్య మరింత ఉద్రిక్తతలు పెరిగాయి. యుద్ధం తప్పదా అన్న విధంగా ఇరుదేశాలు సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఉగ్రవాదులను , వారికి మద్దుతు ఇస్తున్న వారికి Read more

Thiruvananthapuram: దేవుడి ఊరేగింపు కోసం ఏకంగా విమానాల రాకపోకలు ఆగిపోయాయి
దేవుడి ఊరేగింపు కోసం ఏకంగా విమానాల రాకపోకలు ఆపేస్తారు

కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంపైన ఆకాశంలో నిశ్శబ్దం ఆవరించింది. ఏప్రిల్ నెలలో ఒకరోజు ఆ ఎయిర్‌పోర్టులో కొన్నిగంటల పాటు విమానాల రాకపోకలు ఆగిపోయాయి. వాతావరణం అనుకూలంగా Read more

Advertisements
×