సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో రూపొందుతోన్న చిత్రం కూలీ పైన సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయం అధికారికంగా వెల్లడవడం సినిమాకు మరింత హైప్ ను తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం కూలీ చిత్ర షూటింగ్ జైపూర్లో జరుగుతున్నది. ఈ షెడ్యూల్లో రజనీకాంత్ తో పాటు ఆమిర్ ఖాన్ కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కూలీ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రాక్‌లు ఇప్పటికే అభిమానులలో మంచి స్పందనను పొందాయి. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.