స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- డైరెక్టర్ అట్లీ (Allu Arjun – Atlee) కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ ప్రాజెక్ట్ ‘A22xA6‘పై ఆసక్తికర అప్డేట్ రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు రానుంది. మేకర్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేతిలో ఖడ్గం పట్టుకున్న అల్లు అర్జున్ ఫొటోను షేర్ చేస్తూ .. “ఒక స్టైలిష్ పర్సన్ మ్యాజిక్‌ను కలిసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి” అంటూ క్యాప్షన్ జోడించారు. దీనితో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాబోతుంది
ప్రస్తుతం ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజువల్ గ్రాండియర్‌కి పెద్దపీట వేసిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే ప్రపంచ స్థాయి టెక్నీషియన్లను టీంలో చేర్చినట్లు సమాచారం. షూటింగ్ ప్రారంభానికి ముందు బన్నీ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట.
రూ. 800 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం
ఈ చిత్రానికి సుమారు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించగా, ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ మేళవించేలా అట్లీ ఈ కథను డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. రేపటి అప్డేట్‌తో బన్నీ అభిమానుల్లో ఆనందం రెట్టింపవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also : RBI : బంగారంపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు..