దేవభూమి అన్న పేరుతో ప్రసిద్ధి పొందిన ఉత్తరాఖండ్ (Uttarakhand Floods) ఇప్పుడు ప్రకృతి కోపానికి బలైంది. మంగళవారం ఉదయం ఉత్తరకాశీలోని ధారాలీ వద్ద కుండపోత వర్షాలు (Torrential rains at Dharali) సముద్రంలా విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా కల్లోలం మొదలైంది.హర్సిల్ సమీపంలో ఉన్న ధారాలీ ప్రాంతాన్ని భారీ వర్షాలు చిత్తుగా చేశాయి. అక్కడ ఖీర్ గధ్ వాగు ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహించడంతో మునిగిపోయింది. స్థానికంగా ఉన్న గ్రామంలో ఇళ్లు, దుకాణాలు, రహదారులు అన్నీ నీటమునిగిపోయాయి.కలకలం రేపిన ఈ ఘటనలో చాలామంది గల్లంతయ్యారన్న సమాచారం అందుతోంది. మృతుల వివరాలు ఇంకా స్పష్టత ఇవ్వలేని పరిస్థితి.విషయం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్‌డీఆర్ఎఫ్, భారత సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగాయి. వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు ప్రారంభించారు. హెలికాప్టర్లు, నౌకలు, ట్రెక్కింగ్ టీంలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సీఎం ధామి స్పందన – ఆందోళన, చర్యలు కొనసాగుతున్నాయి
ఈ ప్రకృతి విపత్తుపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన అధికారిక సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆయన, “ధారాలీలో జరిగిన వర్షాల వల్ల నష్టం చాలా బాధాకరం. సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి, అన్నారు.ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగంతో తాను నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. “ప్రజలందరూ క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, అని సీఎం ధామి చెప్పారు.
ప్రజలకు అప్రమత్తం – నదులకు వెళ్లవద్దని హెచ్చరికలు
వర్షాల ఉధృతికి నదులు ఉరకలు వేస్తున్నాయి. అధికారులు ప్రజలకు నదీ తీరాలకు వెళ్లకూడదని హెచ్చరించారు. పిల్లలతో పాటు పశువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ప్రస్తుతానికి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు భయంలో జీవిస్తున్నారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఐఎండీ ముందుగానే ఇచ్చిన హెచ్చరికలు
భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే అత్యధిక వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఆగస్టు 4 నుండి ఉత్తరకాశీ, చమోలీ, పౌరీ గఢ్వాల్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని స్పష్టంగా తెలిపింది.దీని ప్రభావంతో డెహ్రాడూన్ జిల్లా అధికారులు పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి ధామి అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. పరిస్థితిని సమీక్షించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అయితే, ముందస్తు హెచ్చరికలు ఉన్నా ఈ స్థాయి నష్టం జరగడం దురదృష్టకరం.
Read Also : 500 Rupee Note : రూ.500 నోట్లు ఆపేయాలన్న ప్రతిపాదనేదీ లేదు : కేంద్రం