బుడంపాడు నారాకోడురు రహదారిపై ఘోరప్రమాధం.ఆటోని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. సంఘటన స్థలంలోనే మృత్యువాత పడిన ముగ్గురు కూలీలు…ఆటోని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం.సంఘటన స్థలంలోనే మృత్యువాత పడిన ముగ్గురు కూలీలు.ఆటోలో మొత్తం పదిమంది ప్రయాణికులు.క్షతగాత్రులను హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతిపై సీఎం చంద్రబాబు విచారం

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.
కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
కూలీపనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు.
మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘటన దురదృష్టకరమని, కుటుంబాలను ఆర్థికంగా సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కూలీలకు అవసరమైన అన్ని మద్దతు అందిస్తామని, వారి కుటుంబాలు అల్లుకుంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ అవగాహనను పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

బుడంపాడు నారాకోడురు రహదారిపై ఘోరప్రమాధం పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి.
- ముగ్గురు మహిళలు మృతి బాధాకరం.
- కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు.
- ప్రమాదంలో గాయపడిన వారికి జీజీహెచ్ లో మెరుగైన వైద్యసేవలు అందించాలని మంత్రిఆదేశాలు.
- మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి రాంప్రసాద్.
గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై స్పందించిన జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్

ప్రమాద ఘటనపై ఆరా తీసిన మంత్రి దుర్గేష్.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు, జీజీహెచ్ వైద్యులకు మంత్రి దుర్గేష్ ఆదేశాలు.ప్రమాదంలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారన్న వార్త కలిచి వేసిందన్న మంత్రి దుర్గేష్.మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించిన మంత్రి దుర్గేష్.బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్